DSC teachers : తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ షాకిచ్చింది. ఈరోజు (మంగళవారం) అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేస్తారనుకుంటున్న సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నామని, తదుపరి కౌన్సెలింగ్ తేదీలను త్వరలో వెల్లడిస్తామని వెల్లడించింది.
అయితే, డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల యొక్క కౌన్సెలింగ్ అన్ని జిల్లాల డాటా రానందున వాయిదా వేయడం జరిగిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. డీఎస్సీ పోస్టింగులు జిల్లాల వారీగా జరుగుతాయని, అన్ని జిల్లాల డాటా అవసరం లేదని కొందరు చెబుతున్నారు. డాటా ఉన్న జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చి, లేని జిల్లాల్లో వచ్చిన తర్వాత చేయవచ్చని, అలా కాకుండా రాష్ట్రం మొత్తం ఆపాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయంతో టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.