Shobha Shetty : ప్రియుడితో శోభా శెట్టి పెళ్లి క్యాన్సిల్..టేస్టీ తేజా కారణంగా ఇంత రచ్చ జరిగిందా!

Shobha Shetty's wedding with her boyfriend was cancelled

Shobha Shetty’s wedding with her boyfriend was cancelled

Shobha Shetty : ‘కార్తీక దీపం’ సీరియల్ లో మోనిత అనే విలన్ క్యారక్టర్ ద్వారా శోభా శెట్టి సంపాదించినా క్రేజ్, పాపులారిటీ మామూలుది కాదనే చెప్పాలి. ఈమెని చూస్తే ఇప్పటికీ భయపడతారు ఆడియన్స్. ఆ రేంజ్ విలనిజం ని ఈ సీరియల్ ద్వారా పండించింది. ఈ సీరియల్ కి ముందు ఆమె పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది, మంచి పాజిటివ్ ఇమేజి ని కూడా సంపాదించింది.

కానీ ‘కార్తీక దీపం’ సీరియల్ లో పోషించిన విలన్ క్యారక్టర్ ని మాత్రం ఆడియన్స్ ఇప్పట్లో మర్చిపోలేరు. అలా ఆ సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీ తో ఈమె నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి  ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది. మొదటి వారం నుండి టాస్కుల విషయం లో మగవాళ్ళతో సమానంగా ఆడుతూ వచ్చిన ఈ ఈమె , చివరి వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది.

ఇంకొక్క వారం బిగ్ బాస్ హౌస్ లో ఉండుంటే ఆమె టాప్ 6 లోకి అడుగుపెట్టి ఉండేది. అయితే హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె డామినేషన్ తో కూడిన యాటిట్యూడ్ తోనే కొనాగుతూ ఉండేది. ప్రేక్షకులు ఈమె డామినేషన్ క్యారక్టర్ ని తట్టుకోలేక ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూసారు. ఆమె ఎలిమినేట్ అవ్వగానే సంబరాలు చేసుకున్నారు. అంటే ఈ రియాలిటీ షో లో కూడా ఆమెని జనాలు విలన్ గానే చూసారు అన్నమాట. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈమె టేస్టీ తేజా, అమర్ దీప్, ప్రియాంక వంటి వారితో చాలా క్లోజ్ గా ఉండేది. ముఖ్యంగా టేస్టీ తేజా తో అయితే చాలా క్లోజ్ గా ఉండేది. ఒకానొక సందర్భంగా శోభా శెట్టి మన మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్ షిప్ ని చూసి మా యశ్వంత్ ఎలా రియాక్ట్ అవుతాడో భయం గా ఉందిరా అని అంటుంది.

అయితే హౌస్ లో నుండి బయటకి వెళ్లిన తర్వాత కూడా ఈ విషయం లో యశ్వంత్ ఎలా రియాక్ట్ అవుతాడో, విడిపోతాము ఏమో అని భయపడింది అట. కానీ యశ్వంత్ మాత్రం చాలా పాజిటివ్ గా తీసుకున్నాడట. మీ రిలేషన్ బయట బ్యాడ్ గా ప్రాజెక్ట్ అయ్యిందని అసలు అనుకోకు, ఎక్కడ హద్దులు దాటలేదు, స్నేహితులు అంటే ఇలాగే ఉండాలి అనే రేంజ్ లో హౌస్ లో ఉన్నన్ని రోజులు ఉన్నారు అని అన్నాడట, దాంతో శోభా శెట్టి ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది.

TAGS