Shoba Shetty : మొన్ననే ప్రియుడిని పరిచయం చేసి..అప్పుడే నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి..

  • వామ్మో బిగ్ బాస్ బ్యూటీ జెట్ స్పీడ్..
Shobha Shetty

Shobha Shetty

Shoba Shetty : బిగ్ బాస్ సీజన్ 7లో శోభాశెట్టి చేసిన హడావిడి అంతా ఇంత కాదు..అమ్మడి నోరు చాలా పెద్దదే. ఆమె అరుపులకు, కేకలకు ..ఎవడు కట్టుకుంటాడో గానీ.. అని ప్రతీ ఒక్కరు అనుకున్నారు. స్వయంగా హౌస్ మేట్లతో పాటు హోస్ట్ నాగార్జున కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చేసుకునేవాడు ఎలా భరిస్తాడో.. వాడిని మూడు చెరువులు నీళ్లు తాగిస్తుందని కూడా ఆటపట్టించారు. తాజాగా శోభాశెట్టి ఎలాంటి హడావిడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా నెల రోజుల కింద బిగ్ బాస్ షోలోనే తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అలాగే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది.

శోభాశెట్టి ‘కార్తీక దీపం’ సీరియల్ లో మోనిత అనే విలన్ పాత్రలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ లో చాన్స్ ఇచ్చారు. అందులో చివర వరకు వచ్చేసింది. బిగ్ బాస్ షోలోనే తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే కార్తీక దీపం సీరియల్ లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్ లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని శోభాశెట్టి ఇప్పుడు బయటపెట్టింది.

తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నారు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. ఇక త్వరలోనే  పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? లేదా ఇలానే పెళ్లి చేసుకుని ఇదే నా పెళ్లి వీడియో అని చెప్పేస్తుందేమో చూడాలి. ఇక పాపం యశ్వంత్ శోభాతో ఎలా వేగుతాడో ఏమో అందరూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

TAGS