Shivani Responding : మెగా ఫ్యామిలీతో గొడవలపై స్పందించిన శివానీ.. ఏం చెప్పిందంటే?

Shivani Responding

Shivani Responding Mega Family Issues

Shivani Responding : టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు రాజశేఖర్.. ఒకప్పుడు ఈయన వరుస సినిమాలతో మంచి మంచి హిట్స్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.. ఇక ఈయన హీరోయిన్ జీవితను పెళ్లి చేసుకున్నాడు.. ఈ జంట గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..

మరి ఈ జంట వారసురాలిగా శివానీ రాజశేఖర్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈమె దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఇంపాక్ట్ చూపించలేక పోతుంది.. అడపాదడపా అవకాశాలు వస్తున్నా ఈమె మాత్రం గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లలో చేరలేక పోతుంది.

ఈ భామ ప్రజెంట్ నటించిన ‘కోటబొమ్మాలి’ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో శివానీ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.. ఈ సినిమా నవంబర్ 24న విడుదల కాబోతుంది.. మరి ఈ క్రమంలోనే తాజాగా శివానీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది.. ఈ ఇంటర్వ్యూలో ఈ భామ మెగా ఫ్యామిలీతో గొడవలపై స్పందించింది.

ఎన్నో ఏళ్లుగా చిరంజీవి రాజశేఖర్ మధ్య గొడవలు ఉన్నట్టు టాక్ వస్తూనే ఉంది. ఈ విషయం మీద ఈమె మాట్లాడుతూ.. బియ్యం గింజ అంత జరిగితే.. బిర్యానీ అంత జరిగిందని బయట ప్రచారం జరుగుతుంది.. రాజకీయాలలో ఉన్నప్పుడు మా కుటుంబాల మధ్య వివాదాలు జరిగాయని.. కానీ అవసరం అనుకుంటే ఖచ్చితంగా అందరం కలిసిపోతాం అంటూ తెలిపింది.

అంతేకాదు ఒకే ఇండస్ట్రీ కాబట్టి పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు.. ఆ జి ఆడవాళ గురించి బయట వారు నానా రచ్చ చేసారు.. అప్పుడప్పుడు ట్రోల్ కూడా చేస్తుంటారు.. అలా చేయడం మంచి విషయమేనా అంటూ తెలిపింది. అలాంటి విషయాలు మేము పట్టించుకోమని.. ఏ విషయం జరిగిన నా సపోర్ట్ మా ఫ్యామిలీకే అంటూ కుండబద్ధలు కొట్టింది.

TAGS