90s A Middle class Biopic : సుమారుగా 96 సినిమాల్లో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో కొనసాగిన శివాజీ, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి తన కెరీర్ ని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అలాంటి సమయం లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి అడుగుపెట్టి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పెద్ద బ్రేక్ కావాలి అని అనుకుంటున్న సమయం లో ఆయనకీ బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది.
రెండు మూడు వారాలు కూడా కొనసాగడం కష్టమని ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత తన అద్భుతమైన ఆట తీరుతో గేమ్ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకొని, శివాజీ లేకపోతే బిగ్ బాస్ షో లేదు, అతన్ని మించిన మైండ్ గేమర్ బిగ్ బాస్ చరిత్రలోనే లేరు అని ప్రేక్షకుల చేత ప్రశంసించబడ్డ కంటెస్టెంట్ గా శివాజీ నిలిచాడు. టైటిల్ కొట్టేస్తాడని అందరూ అనుకున్నారు కానీ, మూడవ స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇది కాసేపు పక్కన పెడితే శివాజీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే ముందు ఈటీవీ విన్ యాప్ వారు తెరకెక్కించిన ’90s’ అనే వెబ్ సిరీస్ చేసాడు. ఈ సిరీస్ శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సీరియస్ కి ఆడియన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సిరీస్ ని చూసిన ప్రతీ ఒక్కరు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. అలా ఈటీవీ విన్ యాప్ టాప్ 1 స్థానం లో కొనసాగుతున్న ఈ సిరీస్ ఇప్పుడు రికార్డులను కూడా నెలకొల్పింది. ఈటీవీ విన్ యాప్ లో ఇప్పటి వరకు ఈ సిరీస్ 100 మిలియన్ కి పైగా వాచ్ మినిట్స్ వచ్చిందట. ఇది ఈటీవీ విన్ యాప్ హిస్టరీ లోనే మొదటిసారి అని అంటున్నారు ట్రేడ్ పండితులు. శివాజీ కి ప్రస్తుతం మహర్దశ నడుస్తుంది అనే చెప్పాలి. కెరీర్ ముగిసిన సమయం లో బిగ్ బాస్ కి రావడం, ఆయన కూడా ఊహించనంత క్రేజ్ ని ఈ షో ద్వారా పొందడం, ఆ వెంటనే ఆయన హీరో గా నటించిన వెబ్ సిరీస్ కి అత్యంత ప్రేక్షకాదరణ దక్కడం, ఇవన్నీ ఆయనకి మహర్దశ నడుస్తుంది అని చెప్పడానికి కారణాలుగా పరిగణించొచ్చు.