Shilpa Shetty : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు ఈడీ షాక్ ఇచ్చింది. రూ.7 వేల కోట్ల బిట్ కాయిన్ పోంజి స్కాంకు సంబంధించి రాజ్ కుంద్రా కు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముంబైలో శిల్పాశెట్టి ఫ్లాట్ ను కూడా అటాచ్ చేసింది.
బిట్ కాయిన్స్ పేరుతో మోపాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు లో ఈడీ తాజాగా దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే శిల్పాశెట్టి దంపతులపై ఈడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 నిబంధనల ప్రకారం రాజ్ కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది.
ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్ కాయిన్ పోంజి స్కీమ్ ను ప్రవేశపెట్టి బిట్ కాయిన్లపై పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయంటూ ప్రజలకు ఆశ చూపింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ పద్ధతిలో సుమారు రూ. 6,600 కోట్లను ఆ సంస్థ వసూలు చేసింది. ఈ మోసం బయటపడడంతో సంస్థ, దాని ప్రమోటర్లపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా దర్యాప్తు ముమ్మరం చేసింది.