Raj Tarun : రాజ్ తరుణ్ కు మద్దతుగా శేఖర్ బాషా.. సహజీవనం తర్వాత విడిపోతే తప్పేంటి?
Raj Tarun : హిరో రాజ్ తరుణ్, లావణ్య కేసు విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. 11 ఏళ్లు సహజీవనం చేసి ఇప్పుడు వేరే హిరోయిన్ తో కలిసి డేటింగ్ చేస్తున్నాడని తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య కోర్టులో కేసు వేసింది. దీనిపై రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ అది ఒకప్పుడు ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. ఆమె వ్యక్తి మస్తాన్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా ఒకరిపై ఒకరు కోర్టులో కంప్లైంట్ చేసుకున్నారు. దీంతో లావణ్య లాయర్ తో సహా ఇంటర్వ్యూలు ఇస్తూ రాజ్ తరుణ్ ను ఎప్పుడు కలిశాను. ఎక్కడ పెళ్లి చేసుకున్నాను. ఎన్ని రోజులు సహజీవనం చేశామనే వివరాలను మీడియా ముందు ఉంచింది. దీంతో పాటు రాజ్ తరుణ్ కొత్త మూవీ తిరగబడరా సామి లో హిరోయిన్ మాల్వీ మాల్హోత్రా పై కేసు సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో మాల్వీ మాల్హోత్రా కూడా దీనిపై లావణ్య పై కేసు వేసింది. నిరాధార ఆరోపణలతో తన పరువుకు నష్టం కలిగించిందని పరువు నష్టం కేసు వేసింది. లావణ్య హిరోయిన్ మాల్వీ సోదరుడు తనను చంపేస్తున్నాడని కూడా ఆరోపణలు చేసింది.
కాగా రాజ్ తరుణ్ ప్రెండ్ శేఖర్ బాషా వెలుగులోకి వచ్చాడు. రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడాడు. ఇష్టం లేకుండా భార్యపై చేయి వేస్తేనే కేసు వేసే రోజులున్నాయి. అలాంటిది లావణ్య ఇష్టం లేకుండానే ఇన్నాళ్లు కలిసి తిరిగిందా.. ఇప్పుడు కొన్నాళ్లు కలిసి ఉండి ఇష్టం లేకపోతే విడిపోతే దానిపై కూడా రాద్దాంతం చేస్తే ఎలా అని లాజికల్ ప్రశ్న సంధించారు. అయినా ఒకబ్బాయి తనకు వద్దు అని చెబుతున్నా.. ఎందుకు ఆయన వెంటే పడుతున్నావ్ అంటూ ప్రశ్నించాడు. అయితే శేఖర్ బాషా మాటాలకు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.