JAISW News Telugu

Women Crushed By Police Men : మహిళ అని చూడకుండా చితకబాదారు.. పోలీసుల దాష్టీకంపై నెటిజన్ల ఫైర్..

Women Crushed By Police Men

Women Crushed By Police Men : ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు హింస పెరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో ఎక్కడ ఏ ఘటన జరిగినా వేగంగా విశ్వవ్యాప్తం అవుతుంది. అది మంచిది కావచ్చు.. చెడు కావచ్చు.. ఇది మంచికేనని బాధితులు అంటుంటే ఇది పూర్తిగా వినాశనానికి అని కొందరంటున్నారు. ఏది ఏమైనా ఈ సోషల్ మీడియాతో రాజకీయన నాయకులు, పోలీసులకు కొత్త చిక్కులు వస్తున్నాయి.

కొవిడ్ సమయంలో లాక్ డౌన్ ఉండగా అత్యవసర పరిస్థితుల్లో తండ్రీ కొడుకు బైక్ పై రోడ్డుపైకి వస్తే పోలీసులు కొడుకు ముందే తండ్రిని లాఠీలతో చితకబాదారు. కొడుకు తన తండ్రిని కొట్టవద్దు అంటూ ఎంత వేడుకున్నా.. చిన్నా పిల్లాడు భయపడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఈ వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. అది కేంద్రం, కోర్టుల వరకు చేరింది. దీంతో ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్ వెంటనే దర్యాప్తు చేపట్టారు. సంబంధిత వివరాలు తెలుసుకొని పోలీసులను వెంటనే సస్పెండ్ చేశారు. ఇది అప్పట్లో సోషల్ మీడియా సాధించిన గొప్ప విజయంగా చెప్పుకున్నారు.

ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. అచ్చు ఇలాంటిది కాకున్నారు. దాని కంటే కూడా ఘోరమనే చెప్పాలి. పౌరులపై చేయి చేసుకునే హక్కు ఎవరికీ లేదు. అది ఎంతటి వారైనా సరే.. సదరు పౌరులు చేసిన తప్పును బట్టి గౌరవ కోర్టు ఆదేశాలతో మాత్రమే చేయి చేసుకునే హక్కు ఉంటుంది. అందునా ఆడవారిపై లేడీ పోలీసులు తప్ప మగ పోలీసులు కనీసం ముట్టుకునేందుకు కూడా వీలు లేదు.

కానీ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మిర్చీ యార్డ్ లో ఒక ఘటన ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒక యువతిని పోలీసులు చితకబాదారు. లేడీ పోలీసులు కూడా కాదు. ఆమె ఏమైనా తప్పు చేస్తే కేసు నమోదు చేసి అది కూడా లేడీ పోలీసులతో అరెస్ట్ చేయించి స్టేషన్ కు తీసుకెళ్లాలి. ఆమె దొంగ అవ్వచ్చు.. ఇంకేమైనా కావచ్చు. కానీ ఇక్కడ అలా జరగలేదు. సదరు మహిళను విచక్షణా రహితంగా బాదారు. ఒకరు కాదు ఇద్దరు పోటీసులు కర్రలతో కొట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయంగా ఉందని అనడం విమర్శిస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియకున్నా.. ఒక మహిళను అలా కొట్టడం మాత్రం కరెక్ట్ కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version