Niharika Konidala : పిల్లలను కనాలని ఉంది..అందుకే రెండో పెళ్లి చేసుకుంటా..: మెగా డాటర్ నిహారిక
Niharika Konidala : మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచింది. హీరోయిన్ గానే కాదు బుల్లితెరపై కూడా ఢీ వంటి షోలతో సందడి చేసిన విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను ఆపేసింది. ఆ తర్వాత ఇద్దరి గ్యాప్ రావడంతో విడాకులు తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో అనేక ఓటీటీ వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇటీవలె ‘డెడ్ ఫిక్సెల్’ అనే సిరీస్ తో యాక్టింగ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చెఫ్ మంత్ర సీజన్ 3 కి హోస్ట్ గా చేస్తున్న నిహారిక ‘సాగు’ అనే ఇండిపెండెంట్ సినిమాకు ప్రజంటర్ గా వ్యవహరించింది. సాగు మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్, ఇష్టాయిష్టాలను గురించి చెప్పింది..
నిహారికను మళ్లీ పెళ్లి కూతురిగా చూడొచ్చా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్తూ..తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లల కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. లవ్ మీద నాకు నెగిటివ్ ఇంప్రెషన్ అయితే లేదు అని తెలిపింది. ‘‘ఒక రిలేషన్ షిప్ వర్కవుట్ కాలేదంటే చాలా మంది వచ్చి కారణాలు అడుగుతుంటారు. చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టే వర్కవుట్ కాలేదు..అలా అని మళ్లీ లవ్ రాదు..ఒక మనిషి మీద ప్రేమ కలగదు అనుకోవడం మూర్ఖత్వం. సో కచ్చితంగా హోప్ ఫుల్లీ పెళ్లి చేసుకుంటానేమో. కానీ త్వరలో అయితే కాదు.. కానీ పెళ్లి అయితే కచ్చితంగా చేసుకుంటాను’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
లవ్ మ్యారేజ్, అరెంజ్డ్ మ్యారేజా అనేది కూడా చెప్పలేను. ఇంట్లో వాళ్లకి అయితే నచ్చకుండా ఏది ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్క్ పై మాత్రమే దృష్టి పెట్టాను. దాని గురించి కూర్చొని అంతగా ఆలోచించలేను. ఏమైనా గాని మంచిగా అనిపిస్తే ఉండొచ్చు.. అని నిహారిక క్లారిటీ ఇచ్చింది.