JAISW News Telugu

Hyper Adi : ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంది.. మాజీ యాంకర్ పై హైపర్ ఆది ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hyper Adi

Hyper Adi-Anasuya

Hyper Adi : జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు, రిలేషన్లు అంటూ షోను రక్తికట్టించేందుకు నిర్వాహకులు ట్రిక్స్ ప్లే చేసేవారు. అలా సుడిగాలి సుధీర్, రష్మి లవ్ ట్రాక్ ను చాలా రోజులు నడిపించారు. అలాగే హైపర్ ఆది, అనసూయపై కూడా చాలా రోజులు ఇలాగే చేశారు. కాకపోతే వారిది లవ్ లా కాకుండా రిలేషన్ లా మెయింటెన్ చేసేవారు. జబర్దస్త్ నుంచి హైపర్ ఆది, అనసూయ దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో వీరి గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది.

హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వదిలివెళ్లాక  షోలు, సినిమాలు చేస్తున్నాడు.  శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీలతో హయ్యస్ట్ పెయిడ్ కమెడియన్ గా రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది జనసేన స్టార్ క్యాంపెయినర్ గానూ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలయ్యే దాక షోలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆది తన కెరీర్, జబర్దస్త్, యాంకర్ అనసూయతో ఉన్న రిలేషన్ పై ఓపెన్ అయ్యాడు.

‘‘జబర్దస్త్ లోకి రాకముందు జాబ్ చేసేవాడిని..అప్పటికే నా ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయింది. నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మొత్తానికి ఉన్న మూడెకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చేశాం. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి సక్సెస్ అయ్యా..’’ అని తన కెరీర్ కష్టాల గురించి చెప్పాడు. ఇక అనసూయ గురించి చెబుతూ..‘‘అనసూయతో నాకు మంచి రాపో ఉంది. అందుకే ఆమెతో స్కిట్ చేసేవాడిని. ఆమె కూడా నేను చేసే ప్రతీ స్కిట్ ను ఎంజాయ్ చేసేది. నన్ను బాగా అర్థం చేసుకునేది. కావాల్సిన రియాక్షన్ ఇచ్చేది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

హైపర్ ఆది కామెంట్స్ పై పలువురు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి టీవీ షోల్లో ఇలాంటి సహజమే. జనాలు ఆసక్తిగా చూడాలంటే ఏదో ఒక హైప్ క్రియేట్ చేయాలి. అప్పుడే ఆ షోకు రేటింగ్స్ అదిరిపోతాయి. ఇలాంటి వాటిని లైట్ తీసుకోవాలి అంతే తప్ప సీరియస్ గా తీసుకోవద్దు.

Exit mobile version