Viral Video : పెళ్లాం కాదు రాక్షసి..

Viral Video

Viral Video

Viral Video : నా పెళ్ళాం కొడుతోంది.. ఆ భాదలు పడలేను. ఆమె తోపాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి నన్ను కాపాడాల్సిందిగా ఓ భర్త రోడెక్కాడు.  రోజు నన్ను నా భార్య చిత్ర హింసలకు గురిచేస్తోంది. ఎందుకు కొడుతుంతో అర్థం కావడంలేడు. ఇష్టం వచ్చినట్టుగా కొడుతోంది. ఒళ్ళంతా వాతలు వస్తున్నాయి. దెబ్బలు భరించలేక పోతున్న. నన్ను కొడుతుంటే ఎందుకు కొడుతున్నావంటే సమాధానం ఉండదు. ఆలా అడిగేసరికి ఇంకా ఎక్కువ దెబ్బలు తగులుతున్నాయి. ఒళ్ళు నొప్పులతో నా పనులు నేను చేసుకోలేక పోతున్నాను. 

నేను ఇంట్లో సరిగానే ఉంటున్నాను. నా తప్పు లేకున్నా కొడుతుంది. తప్పు ఉంటె కొట్టాలనే పద్దతి లేదు కదా. తప్పు ఉంటె చెప్పమంటున్న. తప్పు చేయకున్నా కొడుతోంది ఇదేమి పద్దతి అంటూ ఆ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు ఓపికతో ఉన్నాను. చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాను. ఎందుకు పదిమందిలోకి వెళ్లాలనే కారణంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాను. నా ఓపిక నశించి పోయింది. అందుకే న్యాయం కోసం బయటకు వచ్చాను. ఒకవేళ భర్త తన భార్యను కొడితే భరించలేక ఆమె తిరిగి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను పల్లెత్తు మాట అనుకున్నా ఆమె తోపాటు ఆమె కుటుంబ సభ్యలు నన్ను కొట్టడమే పనిగా పెట్టుకున్నారు.  

నా భార్య కొట్టడం వరకే  పరిమితం లేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. నన్ను కొట్టే అధికారం నా భార్య కుటుంబ సభ్యులకు ఎవరు ఇచ్చారు. భార్యతోపాటు ఆమె పుట్టింటి వారు కూడా కొడుతున్నారు. అంతే కాదు మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. ఇంత హింస బహుశ పోలీస్ స్టేషన్ లో కూడా ఉండదనుకుంటా అంటూ ఆ భర్త కన్నీళ్లతో ఆవేదన పడుతున్నాడు.  

భార్య భాదలు భరించలేక ఆ భర్త తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ ను నమ్ముకొన్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ కు ఆయన తన తల్లి దండ్రులతో వచ్చి ఫిర్యాదు చేసాడు. ఒకసారి పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు నిబంధనలు మేరకు ఫిర్యాదు తీసుకోలేదు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ భర్త అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చెండంతో ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది.

TAGS