Jagan lies : ప్రపంచంలో అతి ఎక్కువ అబద్ధాలు ఎవరు చెప్తారు అనే ప్రశ్న వేస్తే రాజకీయ నాయకులు అనే సమాధానమే వంద శాతం వస్తుంది. ఇక మన భారత దేశ రాజకీయ నాయకులు అబద్ధాల్లో పట్టాలు పుచ్చుకున్నారు. ఇందులో మన ఏపీ రాజకీయ నాయకులు పీహెచ్డీలు చేశారు. వారిలో అగ్రగణ్యుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆయన చెబుతున్న మాటలు విని జనాలకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. దానికి నిదర్శనమే ఎమ్మిగనూరు ప్రచార సభలోని ప్రసంగం. అదేంటో ఒకసారి చదవండి..
ఏపీ సీఎం జగన్ రెడ్డి జనాలను అమాయకులుగా అంచనా వేస్తున్నారు. తాను ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారనుకుంటున్నారు. అబద్ధాలను ఆయుధంగా చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు సభలో మాట్లాడిన జగన్..ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక గురించి అబద్ధాలను అందంగా చెప్పారు.
జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన టీడీపీ.. బుట్టా రేణుక గతంలో తన ఆస్తుల గురించి ఓ యూట్యూబ్ చానెల్ లో చెప్పిన వీడియోను దానికి జత చేసింది. ఆ చానెల్ ఇంటర్వ్యూలో రేణుక తమకు ఆటోమొబైల్, హాస్పిటాలిటీ, విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పారు. అంటే బుట్టా రేణుక ఆర్థికంగా బలవంతురాలే. కానీ జగన్ ఎమ్మిగనూరు ‘మేమంతా సిద్ధం’ సభలో రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని వ్యాఖ్యానించారు. సంపన్నురాలైన రేణుకను పేద మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో సభకు వచ్చిన వారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు.
2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన బుట్టా రేణుక వైట్ లోనే తన ఆస్తి రూ.242 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ లెక్కన ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ 1000కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కానీ జగన్ అందుకు విరుద్ధమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన వ్యాఖ్యలు ట్రోల్ చేస్తున్నారు. తన ఆస్తులతో పోల్చితే రేణుక ఆస్తులు అంతంత మాత్రమే కనుక జగన్ ఆ వర్షన్ లో అలా కామెంట్స్ చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ వాస్తవాలు కళ్లముందు ఉన్నప్పటికీ జగన్ వాస్తవాలను కప్పి పుచ్చుతూ అబద్ధాలను వల్లె వేస్తున్నారు. మరి జగన్ అబద్ధాల గాలానికి ఎమ్మిగనూరు జనం చిక్కుతారా? అనేది చూడాలి.