Mrunal Thakur : తను ప్రేమించి.. ఆరాధించిన నటుడినే కొట్టాల్సి వచ్చిందే..

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ తాను అభిమానించే.. ఆరాధించే నటుడిని కొట్టాల్సి వస్తే ఏం చేసిందో తెలుసా.. ఆ హిరోను చూస్తూ పెరిగి అంతలా ఇష్టం పెంచుకున్న నటుడితో నటించే అవకాశం రావడం థ్రిల్లింగ్ విషయమైతే ఆ నటుడిని చెంపపై కొట్టడం సీన్ చేయమంటే ఎలా అని తెగ బాధపడిపోయిందట మృణాల్ ఠాకూర్. ఆ సీన్ కోసం మూడు గంటల సమయం తీసుకుందంటే ఎంతలా కుమిలిపోయిందో కదా.. అని అనిపించకమానదు.

మృణాల్ ఠాకూర్ కు షాహిద్ కపూర్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయనపై అభిమానం పెంచుకుంది. షాహిద్ కపూర్ తో హిందీలో జెర్సీ మూవీలో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో ఈ మూవీ లో నాని, శ్రద్ధల కాంబినేషన్ అదిరిపోయిన విషయం తెలిసిందే. షాహిద్ ను చెంపపై కొట్టే సీన్  చేయాల్సి రావడంతో మృణాల్ చాలా ఇబ్బంది పడిందంటా.

నేను మెల్లిగా అలా కొట్టినట్లు నటిస్తాను.. మీరు ఎడిటింగ్ లో ఏమైనా చేసుకోండని డైరెక్టర్ కు చెప్పిందంటా.. కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదంటా.. అలా కుదరదు. గట్టిగా కొట్టాల్సిందేనని చెప్పాడు. అయితే షాహిద్ కపూర్ కూడా మీ బాయ్ ఫ్రెండ్ అనుకుని  కొట్టేయండని  ఎంకరేజ్ చేశాడంటా.. కానీ ఈ సీన్ తీయడానికి మూడు గంటల సమయం పట్టిందంటే మృణాల్ ఎంతలా ఇబ్బంది పడిందో అర్థం చేసుకోవచ్చు.

మృణాల్ ఠాకూర్ మరాఠీ ఫ్యామిలో పుట్టింది. తెలుగులో సాయి ధరమ్ తేజ్ తో కలిసి విరుపాక్షలో నటించింది. సీతారామం, మాస్టర్ లాంటి మూవీలతో తెలుగు అభిమానులకు పరిచమైంది. విరుపాక్షలో ఆమె నటనకు చాలా మంది అభిమానులైపోయారు. మృణాల్ బీటెక్ చదివింది. అనంతరం ఫిల్మ్ లలో అవకాశం రావడంతో ఇటు వైపు మళ్లింది. ఈ మధ్యలో మృణాల్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. దీంతో  నేను ప్రస్తుతానికి సింగిల్ ఒక వేళ అలాంటిది ఏమైనా ఉంటే మీకు తప్పకుండా చెబుతాను అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

TAGS