Heart Break : ప్రియుడు చనిపోయాడని గుండెలు పగిలేలా ఏడ్చింది.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..

Heart Break

Heart Break

Heart Break : ప్రపంచంలో అద్భుతమైనది ప్రేమ. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న జంట.. కట్టే కాలే వరకు కలిసి ఉండాలని అనుకుంటారు. క్షణం సేపు తమ ప్రేమభాగస్వామి దూరమైతే భరించలేరు. ప్రేమలో పడ్డవారికి ఈ లోకం కనిపించదు. ఎటూ చూసినా, ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా..తన ప్రేయసి, ప్రియుడితో ఉన్నట్టే అనిపిస్తుంది. నిత్యం తమతో వారు కబుర్లు చెబుతున్నట్టే ఉంటుంది.

ఓ యువతి ఓ యువకుడిని ఎంతగానో ప్రేమించింది. అతడికి తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.  ఇప్పుడా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ పోస్ట్ లో ఏముందంటే.

ఒకరోజు ఆ అమ్మాయికి తన ప్రేమికుడి తల్లి నంబర్ నుంచి అకస్మాత్తుగా ఓ మెసేజ్ వచ్చింది. అందులో తన కొడుకు చనిపోయాడని రాసి ఉంది. హార్స్ రైడింగ్ చేస్తూ కిందపడిపోవడం వల్ల తన కొడుకు చనిపోయాడని అందులో ఉంది. గుర్రంపై స్వారీ చేస్తుండగా యువకుడు కిందపడిపోతే వెంటనే గుర్రం కాలుతో అతడి ఛాతీపైకి ఎక్కింది. దీంతో ఆ యువకుడు గుండె చెడిపోయి చనిపోయినట్లుగా మెసేజ్ లో ఉండడాన్ని ఆ యువతి చూసింది. ఈ కథనాన్ని మిర్రర్ వెబ్ సైట్ లో పబ్లిష్ చేసింది.

తన బాయ్ ఫ్రెండ్ ఇక లేడు అన్న వార్తను జీర్ణించుకోలేక.. అతన్ని మర్చిపోలేక ఆ యువతి 5 రోజుల పాటు శోకసంద్రంలో మునిగిపోయానని తన పోస్ట్ లో తెలిపింది. ఈ వార్త మనస్సుపై ఎంత చెడు ప్రభావాన్ని చూపింది. ఆమె మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్ తో మాట్లాడడం ప్రారంభించింది. అయితే అకస్మాత్తుగా అతడి స్నేహితుల నుంచి షాకింగ్ విషయం తెలిసింది. వాస్తవానికి ఆ అబ్బాయి తల్లి నుంచి వచ్చిన మెసేజ్ పై అమ్మాయి స్నేహితులకు అనుమానం వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ చేయగానే ఆ అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశాడు.

అబ్బాయి హలో అనగానే ఆ అమ్మాయి గుండె పాదాల కింద నేలజారిపోయింది. వెంటనే ఫోన్ లాక్కొని అతడిని దుర్భాషలాడింది. అమ్మాయి వాయిస్ విన్న అబ్బాయి వెంటనే ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు. అయితే ఆమెను సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. చివరకు ఆ అమ్మాయిని కలిశాడు. అతడి మరణానికి సంబంధించిన అబద్ధపు మెసేజ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పాడు. ఆ అమ్మాయితో విడిపోవాలని అనుకున్నానని, కానీ చెప్పలేకపోయానని అందుకే ఈ మెసేజ్ పెట్టానని చెప్పుకొచ్చాడు.

తన లవ్ స్టోరీ, బ్రేకప్ కథ ఇలా ఉందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమె ప్రియుడిని నెటిజన్లు దారుణంగా తిడుతున్నారు. అలాంటి వాడివి ఎందుకు ప్రేమించాలి.. ప్రేమించిన వారిని ఎందుకు క్షోభ పెట్టాలని కామెంట్స్ పెడుతున్నారు.

TAGS