JAISW News Telugu

Sharmila Petition : షర్మిల పిటిషన్.. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే


Sharmila Petition : ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. వైఎస్సార్ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కడప కోర్టు వివేకాహత్య కేసుపై మాట్లాడవద్దంటూ ఏప్రిల్ 16న ఆదేశాలిచ్చింది.

ఈ ఆదేశాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ ను కొట్టి వేయడంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా, వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని జస్టిస్ గవారు ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని ఆక్షేపించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది.

Exit mobile version