Sharmila Vs Jagan : అన్నకు వ్యతిరేకంగా జనంలోకి షర్మిల..సీన్ రివర్స్ అయ్యిందిగా..
Sharmila Vs Jagan : రాజకీయాల్లో బాంధవ్యాలు, బంధువులు ఉండరు అంటారు.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న నానుడి రాజకీయాల్లో బాగా పనికొస్తుంది. రాజకీయాల్లో సెంటిమెంట్లు ఉండవు..ఓన్లీ సీట్ల సమరాలే ఉంటాయి. రక్తసంబంధాలు ఉండవు.. తిట్ల దండకాలే ఉంటాయి. రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేడు. మొన్నటి దాక మన వెనక తిరిగిన వాడు సడెన్ గా ప్రత్యర్థి పంచన చేరవచ్చు. నిత్యం రాజకీయం రంగు మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎవరి ఆట వారిదే. ఎవరి గెలుపు వారిదే. అన్నైనా..చెల్లైనా..!
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, జగన్ రెడ్డి సోదరి షర్మిల జనంలోకి వెళ్తున్నారు. మొన్ననే బాధ్యతలు తీసుకున్నా షర్మిల ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో నిస్తేజంగా ఉన్న పార్టీలో దూకుడు పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సిక్కోలు నుంచి కడప దాక నెలాఖరు వరకు పర్యటన చేయబోతున్నారు. షర్మిల ఇప్పటి వరకూ ఏపీలో ఎప్పుడు ప్రచారం చేసినా మా అన్న జగన్ రెడ్డికి ఓటేయండి.. అని అడిగేవారు. తల్లి, చెల్లి ఇద్దరూ కలిసి జగన్ కోసం ఊరూవాడా తిరిగేవారు. సెంటిమెంట్ పండించేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరుగా జగన్ రెడ్డిని టార్గెట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఆమె వ్యతిరేక ప్రచారం కన్నా.. ఎక్కువగా చెల్లిని జగన్ రెడ్డి ఎంత మోసం చేస్తే ఇలా రివర్స్ లో కాంగ్రెస్ లో చేరి రివేంజ్ తీర్చుకోవడానికి వస్తుందో అనే చర్చే ప్రజల్లో ఎక్కువగా జరుగుతోంది. రాబోయే రోజుల్లో కూతురికి మద్దతుగా తల్లి కూడా కనిపిస్తే జగన్ రెడ్డి నైతికంగా పాతాళానికి పడిపోయినట్టే. తల్లి, చెల్లి మద్దతును కూడగట్టలేనివాడు ఇక జనాల అభిమానాన్ని ఎలా కాపాడుకోగలుగుతాడు?
తల్లి, చెల్లినే తమను జగన్ రెడ్డి మోసం చేశారని ఫీలవుతూంటే.. ఇక ఏపీ జనాలు ఏమని ఫీల్ కావాలి. చెప్పిన వాటికి.. చేసిన వాటికి పొంతన లేదు.. అప్పులు పుట్టినన్ని రోజులు బటన్లు నొక్కకుంటూ వచ్చారు. ఇప్పుడు బటన్లు నొక్కుతున్నా డబ్బులు రాలడం లేదు. అందరూ షర్మిలలాగే ఫీలవుతున్నారు. వారు త్వరలోనే రివెంజ్ తీర్చుకునే రోజు రాబోతోంది.