JAISW News Telugu

Sharmila Silent : కీలక టైంలో షర్మిల సైలెంట్..ఇక్కడ కూడా ‘త్యాగం’?

Sharmila Silent

Sharmila Silent

Sharmila Silent : వైఎస్ షర్మిల.. ఎన్నికలు లేనప్పుడు పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. తీరా ఎన్నికలు సమీపించేసరికి పోటీ నుంచి దూరంగా వెళ్తారు. దీనికి నిదర్శనం మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే. రాజకీయాల్లో త్యాగం కూడా అవసరమేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈ సీన్ ఏపీలో రిపీట్ చేస్తారా అనే డౌట్లు అందరికీ వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టి సొంత అన్నపైనే తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన షర్మిల ఎన్నికల వేళ సైలెంట్ అయ్యారు. షర్మిల ఆరోపణలు, విమర్శలతో వైసీపీ అధినేతను ఇరుకునపెట్టారు. సొంత అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి సిద్ధమైన షర్మిల.. జగన్ ఇరుకునపెట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలకు పదునైన ఆయుధంగా దొరికిందనే చెప్పాలి. షర్మిలకు తోడుగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా తన గళం విప్పడంతో చెల్లెళ్లే జగన్ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నారా? అనే అనుమానాలు కూడా కలిగాయి.

సొంత  చిన్నాన్న హత్యకు న్యాయం చేయలేని జగన్ ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు? సొంత చెల్లెళ్లపై తన కాలకేయ సైన్యంతో వ్యక్తిగత విమర్శలకు దిగిన జగన్ అన్న ఇక రాష్ట్రంలోని ఆడపడుచులకు ఎలా భద్రతా కల్పిస్తారు? అని విరుచుకుపడింది. ప్రత్యేక హోదా కోసం ఎవరి మెడలు వంచుతానన్నాడో వారి దగ్గరే మెడలు వంచి మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మీద కొట్టాడని తీవ్ర ఆరోపణలు చేసింది.

కాంగ్రెస్ పార్టీ తరుపున విశాఖ ఉక్కు కోసం ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చి మరి అన్న మీద యుద్ధానికి సై అంటూ పిలుపునిచ్చిన షర్మిల ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎన్నికలకు ఇంకా 45 రోజుల సమయమే ఉన్న  నేపథ్యంలో షర్మిల అనూహ్యంగా ఏపీ రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. జగన్ ‘మేమంతా సిద్ధం’ ప్రారంభ కార్యక్రమానికి తల్లి విజయలక్ష్మిని తెర మీదకు తెచ్చిన జగన్ చెల్లి షర్మిలకు చెక్ పెట్టగలిగాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అత్తారిల్లు.. పుట్టిల్లు  అంటూ నిలకడ లేని రాజకీయాలు చేసి షర్మిల ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు.

తెలంగాణ ఎన్నికల ముందులాగానే ఇక్కడ కూడా పోటీ నుంచి తప్పుకుంటారా? నమ్మిన కాంగ్రెస్ జెండా పట్టుకుని నిలబడతారా? లేక నమ్ముకున్న వారి కోసం జెండా మారుస్తారా? అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే సమాధానమే వస్తోంది. ఇప్పటికే తల్లిని తనకు అనుకూలంగా చేసుకున్న జగన్ చెల్లి షర్మిలను తన వైపు తిప్పుకోలేరా? అనే ప్రశ్న జగన్ రాజకీయాన్ని నిశితంగా గమనించిన వారికీ ఇట్టే జవాబు దొరుకుతుంది.

Exit mobile version