Sharmila Vs Jagan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒక వైపు, వైసీపీ మరో వైపు, కాంగ్రెస్ పార్టీ ఇంకో వైపు తమ బలం ప్రదర్శించాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. అందుకే వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది.
ఇంకా వైసీపీ అనుకూల ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ ఫోకస్ పెడుతోంది. జగన్ కు అనుకూలంగా ఉన్న వారు, వైఎస్ అభిమానులు జగన్ పై ఉన్న కోపంతో షర్మిలకు వేస్తారు. అందుకే షర్మిలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో ఇది టీడీపీ కూటమికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
షర్మిల సహకారంతో టీడీపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జగన్ వ్యతిరేక ఓట్లు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే అస్త్రంగా నిలుస్తున్నాయి. ఈనేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు సానుకూలంగా మలుచుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఏపీలో రాజకీయ మార్పులకు కాంగ్రెస్ వేదికలా మారబోతోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని పలు అంచనాలు చెబుతున్నాయి. అన్ని సర్వేలు టీడీపీ కూటమికి అధికారం దక్కుతుందని చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని టీడీపీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. దీంతో రాబోయే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు మూడు పార్టీలు ముఖ్యంగా టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ లో తమదే విజయమనే ధీమా కనిపిస్తోంది. అధికారం ఖాయమనే ధోరణి నేతల్లో కూడా వ్యక్తమవుతోంది. షర్మిల చీల్చే ఓట్ల ద్వారా వైసీపీకి పెను గండం పొంచి ఉందని తెలుస్తోంది. ప్రజలు కూడా ఇప్పటికే ఓటు ఎవరికీ వేయాలో దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా మరో రెండు నెలల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియనుంది.