YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి అంశం ఒక్కో పార్టీ ఒక్కో విధంగా తీసుకుంటుంది. ముందుగా వైసీపీ ఈ అంశాన్ని తీవ్రంగా జనాల్లోకి జొప్పించి సింపతీ గెయిన్ చేసి ఓట్లు రాబట్టుకోవాలని అనుకుంది. కానీ ఎందుకో తెలియదు కానీ మొదట్లో తెగ హడావుడి చేసిన వైసీపీ నాయకులు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.
ఇక ఇదే అంశం టీడీపీ+మహా కూటమిపై వేసి వారిని అప్రతిష్టపాలు చేసినా ఓట్లు తమ ఖాతాకు మల్లుతాయని కలలు కన్నారు. కానీ ఆ విధంగా జరగలేదు. రాళ్ల దాడి తర్వాత చంద్రబాబు నాయుడు ఒక రోడ్ షోలో మాట్లాడుతూ ‘ప్రతీ ఎన్నికల ముందు ఇదే సీన్ రిపీట్ చేస్తే జనాలు నవ్వుతార’ని చెప్పారు. దీంతో వైసీపీ నాయకులు కూడా సైలెంట్ అయ్యారు.
ఇక మహా కూటమిలో ఉన్న జనసేన దీన్ని ‘కోడి కత్తి 2.0’గా అభివర్ణిస్తూ.. ఎన్నికల్లో సింపతీ కొట్టేసేందుకు మంచి అవకాశమే వచ్చిందన్న పవన్ కళ్యాణ్ సీఎం భద్రత గురించి ప్రస్తావించి ప్రభుత్వ వైఫల్యంపై ఎండగట్టాడు. ఇది కూడా తిరిగి తిరిగి ప్రభుత్వం మెడకే చుట్టేట్లు ఉందని కప్పను తిన్న పాములా సైలెంట్ అయిపోయింది వైసీపీ పార్టీ.
ఇక తర్వాత స్థానంలో ఉన్నది జగన్ సోదరి వైఎస్ షర్మిల వైసీపీ, జగన్ పై విరుచుకుపడుతున్నారు కానీ తన ప్రసంగంలో రాళ్లదాడిని ఎక్కడా ప్రస్తావించలేదు. జగన్ నెరవేర్చని ఎన్నికల హామీలపై ఆమె ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా ఈ దాడి ఘటనను ప్రస్తావించలేదు. దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ ఆమె మత్రం ఆ ఘటనే ఒకటి జరగలేదని అన్నట్లు సైలెంట్ గా ప్రభుత్వంలోని లోపాలను మాట్లాడి ముగించింది.
ఇప్పుడు లేచారు.. లేదు లేదు ఎలక్షన్స్ ఉన్నాయి కదా: షర్మిల pic.twitter.com/vCfZt11vyr
— M9 NEWS (@M9News_) April 14, 2024