Sharmila Attack : రాజకీయాల్లో మౌనంగా ఉండేవారు తక్కువ.. వైసీపీ అధినేత జగన్ చీటికి మాటికి మాట్లాడరు. ప్రతిపక్షాలు ఎన్ని మొత్తుకున్నా తన పెదవి విప్పరు. ఎందరు విమర్శలు చేసినా పట్టించుకోరు. గతంలో పీవీ నరసింహారావుకు మౌనమునీంద్రుడు అనే బిరుదు ఉండేది. ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలా మాట్లాడినా తన మౌనం మాత్రం వీడరు.
ప్రస్తుతం తన చెల్లెలు షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకుంది. ఎక్కడ పడితే అక్కడ జగన్ తీరును ఎండగడుతోంది. కానీ జగన్ మాత్రం ఎక్కడ కూడా పెదవి విప్పిన దాఖలాలు లేవు. తనపై ఎవరూ ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా స్పందించరు. ప్రత్యర్థుల దూషణల నుంచి ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయరు. జగన్ మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా పట్టించుకోరు. వారిని గుర్తించి వారిని ఏదో ఒకటి చేయాలని అనుకోరు. మౌనంతోనే సమాధానాలు చెబుతుంటారు. అందుకే జగన్ కు మౌనం బాగా కలిసొస్తుందంటారు. జగన్ ను తిడితే అతడి అభిమానులు మాత్రం ఉగ్రరూపం దాల్చుతారు. కానీ జగన్ మాత్రం సైలెంట్ గా ఉండటానికి ఇష్టపడతాడు.
ఎద్దు ఎగరగానే గంట ఎగరదని నమ్మిన జగన్ మౌనముద్రకే ఓటు వేస్తుంటారు. అందుకే ఎవరెన్ని ఆరోపణలు చేసినా జగన్ వారిని మాట కూడా అనరు. ఈపరిస్థితుల్లో చెల్లెలు షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా ఎక్కడ కూడా స్పందించడం లేదు. పులివెందులలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో షర్మిల జగన్ ను నానా మాటలు అన్నారు.
జగన్ పై చెల్లెలు షర్మిల ఆరోపణలు చేస్తుండడంతో ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. జగన్ పాలనలో అత్యధికంగా నష్టపోయింది తన చెల్లెలే అని అంటున్నారు. తనకు న్యాయం కావాలని షర్మిల నినదిస్తోంది. చిన్నాన్న హత్యను చూపుతోంది. అయితే జగన్ గురించి బాగా తెలిసిన వారు మాత్రం జగన్ సైలెంట్ గా ఉన్నా ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసని అంటుంటారు. మరి చెల్లెలి విమర్శలు పదునెక్కుతుండడంతో జగన్ ఏం చేయబోతున్నారు..అనేది మాత్రం ఆసక్తిగా మారింది.