Shankar Meena : ఎంబీఏ మధ్యలోనే వదిలేశాడు.. నెలకు రూ.13 లక్షలు సంపాదిస్తున్నాడు

Shankar Meena

Shankar Meena

Shankar Meena : మనిషై పుట్టిన వాడు కారాదు మట్టి బొమ్మ.. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నారో సినీకవి. మనిషిలో దాగున్న శక్తి సామర్థ్యాలను బయటకు తీస్తే మనం ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. చేసే పనిలో అంకితభావం, పట్టుదల ఉంటే మనం ఎంతో దూరం వెళ్లొచ్చు. ఏ పని అయినా చిత్తశుద్ధితో చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

అతడి పేరు శంకర్ మీనా (రాజస్థాన్). ఎంబీఏలో చేయాలని అందులో చేరినా ఎందుకో వదిలేశాడు. దాన్ని మధ్యలోనే వదిలేసినా వ్యవసాయంలో మాత్రం ఎంతో ఎత్తుకు ఎదిగాడు. పుట్టగొడుగుల పెంపకంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. మష్రూమ్స్ పై పట్టు సాధించాడు. ఇంటి వద్దే సాగు ప్రారంభించాడు. ఇప్పుడు వేలాది మందికి రోల్ మోడల్ గా మారాడు.

నెలకు రూ. 13 లక్షలు సంపాదిస్తున్నాడు. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. తన సంస్థ జీవన్ మష్రూమ్స్ ను విదేశాలకు విస్తరించాడు. వ్యవసాయంలో పలు అవార్డులు అందుకున్నాడు. పుట్టగొడుగు జాతులను అందరికి పరిచయం చేశాడు. వారికి ఇప్పుడు ఇదే ప్రధాన ఆదాయంగా మారింది. ఇలా వ్యవసాయంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

ఇలా తాను అనుకున్న రంగంలోనే రాణిస్తున్నాడు. వ్యవసాయమే కదా అని తేలిగ్గా తీసి పారేయలేదు. అందులో ఎన్నో రకాల పద్ధతులు తెలుసుకుని తనదైన రీతిలో సాగు చేస్తూ అందరికి ఆశలు కల్పిస్తున్నాడు. శంకర్ మీనా చేతల వల్ల పుట్టగొడుగుల పెంపకం మీద ఆసక్తి కలుగుతోంది. వాటి ద్వారా వచ్చే ఆదాయం ఘనంగా ఉండటంతో అతడి ఆలోచనలు మంచి రేంజ్ కు వెళ్లాయి.

TAGS