Raghurama : అసెంబ్లీలో రఘురామ కృష్ణంరాజుకు అవమానం..జగన్ తో భేటీ అందుకేనా?
Raghurama : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇది మాజీ సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుల మధ్య జరిగిన ఆసక్తికర భేటీయే ఇందుకు నిదర్శనం. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే రఘురామ… మాజీ సీఎం వైఎస్ జగన్ పక్కన కూర్చుంటూ పలు అంశాలపై చర్చించుకున్నారు. ఈ ఫొటో ఫ్రేమ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీలో రెబల్ గా మారారు.
కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపి టీడీపీ తరుఫున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ భారీ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశే ఎదురైంది. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రఘురామ కృష్ణంరాజుకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రులు కార్లకు మాత్రమే అనుమతి ఉండడంతో రఘురామ కృష్ణంరాజు కారును అధికారులు గేటు ముందే ఆపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ, మంత్రుల కాన్వాయ్‌లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను ప్రశ్నించారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన… ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాతే తర్వాతే జగన్‌తో రఘురామ కృష్ణం రాజు ముచ్చటించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించకుంది. జగన్‌ను అసెంబ్లీకి రావాలని రఘురామ కోరడం, ఆయన కోరినట్టుగానే జగన్ అసెంబ్లీకి వస్తాననడం జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి టీడీపీలో కూడా రఘురామ కృష్ణంరాజు రెబల్ గా మారతారా అనే ప్రశ్న తలెత్తుతోంది.