Shakila : షకీలాను రూంకు రమ్మన్న స్టార్ డైరెక్టర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మలయాళ హాట్ నటి

Shakila

Shakila

Mallu Actress Shakila : మలయాళ సెకెండ్ గ్రేడ్ మూవీల్లో హీరోగా నటించిన షకీలా  90 నుంచి 2000 సంవత్సరం వరకు దేశ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఆమె నటించిన సినిమాలు గ్లామర్ రోల్స్ కావడంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. ఒక స్టార్ హీరో డేట్స్ దొరికేవేమో కానీ షకీలా డేట్స్ దొరకడం కష్టమయ్యేది. క్లీవేజ్ షోతో యువకుల మనుసులే కాదు.. అందరి హృదయాలను కొల్లగొట్టింది.

కాగా ఈమె జీవితం పూల పాన్పు కాదు. డబ్బుల కోసమే తన తల్లి వ్యభిచార వృత్తిలోకి దించిందని చెప్పింది. అయితే తాను సినిమాల్లో పని చేసిన సమయంలో డబ్బులు బాగా వచ్చేవని తన చెల్లిని నమ్మి అన్ని ఇస్తే ఆస్తులన్నీ కూడబెట్టుకుని తనను సొంత ఇంటి నుంచే గెంటేశారని చెప్పింది. ఇలా ఎక్కడికి వెళ్లినా అవమానాలు చీత్కారాలు ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని ఇంటర్వ్యూలో చెబుతూ గోడు వెల్లబోసుకుంది.

కాగా షకీలా తెలుగులో  చాలా సినిమాల్లో నటించింది. ఇక్కడ తేజ దర్శకత్వంలో నటించిన జయం మూవీ ద్వారా తెలుగులో కూడా ఆడియన్స్ కు దగ్గరైంది. కానీ తనను ఒక డైరెక్టర్ రూంకు రమ్మన్నడని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అతనెవరో కాదు హీరో అల్లరి నరేశ్ తండ్రి ఇవీవీ సత్యనారాయణ. షకీలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పటి స్టార్ డైరెక్టర్ ఇవివి తనను రూంకు పిలిచాడని ఆరోపించింది.

ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ నివేదికతో అందరి పూసాలు కదులుతున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని  పేర్లతో సహా నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. దీంతో మలయాళ ఇండస్ట్రీ గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయని, క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని తేలింది. మరి షకీలా ఆరోపణలతో అల్లరి నరేశ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

TAGS