Shahrukh Khan : ఆ స్టార్ హీరో చేతిలో చావు దెబ్బలు తిన్న షారుఖ్ ఖాన్!
Shahrukh Khan : బాలీవుడ్ లో ప్రస్తుతం షారుఖ్ ఖాన్ మేనియా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత ఏడాదికి ముందు దశాబ్దకాలం మొత్తం ఆయన ఫ్లాపులలోనే ఉన్నాడు. ఆ ఫ్లాప్స్ దెబ్బకి ఆయన ఇక సినిమాలు చేస్తాడా అనే స్థాయికి పడిపోయాడు.బాగా గ్యాప్ తీసుకొని ‘పఠాన్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు.
ఈ సినిమా తర్వాత అదే సంవత్సరం లో ఆయన ‘జవాన్’ చిత్రం తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకొని మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నాడు.అదే ఏడాది ఆయన ‘డుంకీ’ అనే చిత్రం ని విడుదల చేసి ఆ సినిమా మరో 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు. అలా షారుఖ్ ఖాన్ నుండి గత ఏడాది బాలీవుడ్ కి 2500 కోట్ల రూపాయలకు పైగానే బిజినెస్ జరిగింది.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన సినిమాల్లో తన పాత్రల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నా ప్రతీ సినిమాలోనూ హీరో పాత్ర మంచి పనులు చేస్తూ,నలుగురికి ఆదర్శం అయ్యే విధంగానే ఉంటాయి. కెరీర్ ప్రారంభం లో నేను కొన్ని నెగటివ్ క్యారెక్టర్స్ చేశాను. నెగటివ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు హీరో చేత తన్నులు తినక తప్పదు. అలా నేను కూడా చాలా సినిమాల్లో దెబ్బలు తిన్నాను. ఆ తర్వాత లవ్ స్టోరీస్ ఎంచుకొని స్టార్ హీరో అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు షారుఖ్ ఖాన్. అప్పట్లో సన్నీ డియోల్ హీరో గా నటించిన ‘డర్’ అనే చిత్రం లో షారుఖ్ ఖాన్ నెగటివ్ రోల్ చేసాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన సైకో పాత్రని చూస్తే ఎవరికైనా భయం వెయ్యాల్సిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘బాజీగర్’, ‘అంజాన్’ వంటి చిత్రాలలో నెగటివ్ రోల్స్ చేసాడు.
ఈ రెండు సినిమాల్లో ఆయనే హీరో కూడా. ఇకపోతే షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డుంకీ’ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని తెచుకున్నప్పటికీ సలార్ మేనియా ని తట్టుకొని 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఊదా ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. ఈ సినిమాకి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే.