Kumbh Mela : కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన షారుఖ్, సల్మాన్ ఖాన్ లు.. నిజమెంత?

Kumbh Mela Sharukh and Salman
Kumbh Mela : ఈసారి మహాకుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది పర్యాటకులు రావచ్చని స్థానిక యంత్రాంగం భావిస్తోంది. దీంతో భద్రతా చర్యలను పటిష్టం చేశారు. అయితే ఈసారి సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక కొందరైతే ఏఐ ద్వారా ఫొటోలు సృష్టించి తమకు ఇష్టమైన హీరోలు కుంభమేళాలో స్నానాలు చేశారని వైరల్ చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ అగ్రహీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు పుణ్య స్నానాలు చేసిన ఏఐ ఫొటోలు వైరల్ అయ్యాయి. కొందరేమో వారు స్నానాలు చేశారు ఇవి నిజమైన ఫొటోలు అంటుండడగా.. ఇవి ఏఐ ఫోటోలని.. చూస్తేనే తెలుస్తోందని.. ఖాన్ హీరోలు స్నానాలు చేయలేదంటున్నారు. నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.