JAISW News Telugu

Kamareddy : డీఎంహెచ్ వో లైంగిక వేధింపులు.. కేసులు నమోదు

Kamareddy

Kamareddy

Kamareddy : కామారెడ్డి డీఎంహెచ్ వో డి.లక్ష్మణ్ సింగ్ పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై ఏడు కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావు బుధవారం తెలిపారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద మంగళవారం ఐదు కేసులు, బుధవారం మరో రెండు కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. ఏడాదిన్నర కాలంగా తమను లక్ష్మణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నట్లు వైద్యాధికారిణులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. డీఎంహెచ్ వో ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

కామారెడ్డి డీఎంహెచ్ వో లక్ష్మణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంగా తమను లైంగిక వేధింపులకు గురి చేస్తన్నాడంటూ వైద్యాధికారిణులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర వైద్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. లైంగిక వేధింపుల ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ విచారణలో తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారని 10 మందికి పైగా వైద్యాధికారిణులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

Exit mobile version