UPI Services : UPI సేవలకు తీవ్ర విఘాతం.. NPCI ఏం చెప్పిందంటే?

Severe disruption to UPI services..

Severe disruption to UPI services..

UPI Services : దేశవ్యాప్తంగా మంగళవారం (ఫిబ్రవరి 6) పలువురు యూపీఐ వినియోగదారులు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని NCPI ధృవీకరించి. కొన్ని బ్యాంకులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యల కారణంగానే కొందరు వినియోగదారులు ఇబ్బందులు పడ్డారని NCPI పేర్కొంది.

‘కొన్ని బ్యాంకుల్లో అంతర్గత సాంకేతిక సమస్యలు ఉన్నందున UPI కనెక్టివిటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. NCPI వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి. సత్వర పరిష్కారాన్ని నిర్ధారించడానికి మేము ఈ బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాము’ అని NCPI ఎక్స్ (ట్విటర్)లో తెలిపింది.

మంగళవారం (ఫిబ్రవరి 6) యావత్ దేశంలో అనేక మంది UPI వినియోగదారులు తమ చెల్లింపులు జరగకపోవడంతో సేవలు అందడం లేదని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ సహా అన్ని పాపులర్ యూపీఐ యాప్ లను ఉపయోగించే వినియోగదారులు ఈ సమస్యలను ఎదుర్కొన్నారు.

మర్చంట్ యాప్ లో UPIని ఉపయోగిస్తున్న ఒక కస్టమర్ కు అన్ని UPI యాప్ లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని మెసేజ్ వచ్చింది. ఎస్బీఐ, కొటక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు కూడా లావాదేవీల్లో సమస్యలు ఎదుర్కొన్నారు.

చాలా మంది UPIలో లోపాన్ని ప్రస్తుత Pay-tm సమస్యలతో ముడిపెట్టారు. అయితే, డౌన్ టైమ్ కు Pay-tm ఎదుర్కొంటున్న రెగ్యులేటరీ సమస్యలకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకర్లు చెప్పారు. ఈ సమస్యతో ఎక్కువగా సతమతం అయిన బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ.

కొంతమంది కస్టమర్లకు ప్రతిస్పందనగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘UPIలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది, ఇది పెద్ద వ్యవస్థలో భాగంగా కనిపిస్తుంది’ అని తెలిపింది. అయితే, ఇప్పుడు తిరిగి యధావిధిగా కార్యకలాపాలకు చేపడుతున్నట్లు తెలిపింది.

జనవరిలో దేశంలో UPI లావాదేవీలు కొత్త రికార్డును తాకాయని ఈ నెల ప్రారంభంలో NCPI నివేదించింది. NCPI డేటా ప్రకారం 2024, జనవరిలో UPI లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ . 18.41 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ఎక్స్ లోని పీఎంవో ఖాతా కూడా కొత్త రికార్డును నమోదు చేసింది.

TAGS