Central Budget : ఏడోసారి కేంద్ర బడ్జెట్.. నిర్మలమ్మ రికార్డు
Central Budget : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ ను ఈరోజు (మంగళవారం) నిర్మలమ్మ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా ఏడోసారి బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించారు. తద్వారా వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఆరు వార్షిక బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన రికార్డు నమోదైంది. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్ ను మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు.
నిర్మలా సీతారామన్ 2019 మే 30 నుంచి ఆర్థికమంత్రిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తర్వాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్ లు అందించారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25 కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారు.
TAGS Central BudgetCentral Budget 2024Finance MinisterFinance Minister Nirmala SitaramanLatest Central Budget