Sreeleela : అలాంటి వాడితోనే ఏడడుగులు వేస్తా.. శ్రీలీల కామెంట్స్ వైరల్!
Sreeleela : మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల.. ఈ యంగ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ భామ ఎంట్రీ ఇచ్చిన కొద్దీ రోజుల్లోనే చాలా క్రేజ్ తెచ్చుకుంది.. పెళ్లి సందడితో స్టార్ట్ అయ్యిన ఈమె కెరీర్ అంచలంచలుగా ఎదుగుతూ వచ్చింది.
ఇక ధమాకా వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగి పోవడమే కాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించే అవకాశం వచ్చింది.. శ్రీలీల చేతిలో ఏ హీరోయిన్ కు లేనన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ ఆదికేశవ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈమె తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పింది.. తనను చేసుకోబోయేవాడు అందంగా ఉండడం మాత్రమే కాదు.. అతడికి కుటుంబం అంటే విలువ ఉండాలి.. అలాగే మంచి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉండాలి.. కొన్ని కొన్ని విషయాల్లో నన్ను భరించడం కష్టం అందుకే ఆ కష్టాన్ని సైతం ఇష్టంగా భరించే వాడు కావాలి అని అతడితోనే ఏడడుగులు వేస్తానని తెలిపాడు..
ఈమె పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ మహేష్ తో గుంటూరు కారం చేస్తుంది.. అలాగే విజయ్ దేవరకొండ తో ఒక సినిమా పవన్ తో భవదీయుడు భగత్ సింగ్ ఇలా ఈమె చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి..