JAISW News Telugu

Seven Marriages : ఆరేళ్లలో ఏడు వివాహాలు.. మహిళపై కోర్టు ఆగ్రహం

Seven Marriages

Seven Marriages

Seven Marriages : ధనవంతులను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఏదో సాకుతో విడాకులు తీసుకోవడం కర్ణాటకకు చెందిన ఓ మహిళకు పరిపాటిగా మారింది. భర్తపై గృహ హింస కేసు పెట్టి డబ్బులతో ఉడాయించేది. ఇలా ఆరేళ్లలో ఏడు పెళ్లిల్లు చేసుకుంది. ఏడో భర్త ఆమె మోసాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివాహమైన ఆరు నెలల తర్వాత తనను భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ గృహహింస కింద కేసులు పెట్టేది. వారు రాజీపడి, పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి కేసు నుంచి తప్పుకునేవారు. ఇలా తాజాగా ఆ మహిళ ఏడో భర్తపైనా కేసు పెట్టింది. దీంతో ఆ మహిళ తీరును న్యాయమూర్తి సోమవారం ఖండించారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు కలిసి ఉండకపోవడమంటే, అందులో మీ తప్పే కనిపిస్తోందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేశారు.

Exit mobile version