Sheep Scam : గొర్రెల సొమ్ము ఏడువందల కోట్లు నొక్కేశారు

Sheep Scam

Sheep Scam

Sheep Scam : కోటి రూపాయలు కాదు, పది కోట్లు కాదు మహా అంటే ఓ 50 కోట్లు అంటే అదో లెక్క అనుకోవచ్చు. కానీ ఏకంగా గొర్రెల పంపిణి పథకం సొమ్ము ఏడువందల కోట్ల రూపాయలు నొక్కేశారు. ఇది తెలిసిన గొర్రెల కాపరులు కాదు, గొర్రెలే ముక్కున కాలు వేసుకుంటున్నాయి. ఒక నొక సందర్భంలో మాజీ సీఎం ఒక మాట అన్నారు. అతి తొందరలోనే మన రాష్ట్రము నుంచి విదేశాలకు యాదవులు మాంసం ఎగుమతి రోజులు వస్తాయని అన్నారు. అంటే విదేశాలకు మాంసం పోలేదు. కానీ సంబంధిత శాఖలకు చెందిన కొందరు అధికారుల, పలువురు రాజకీయ నాయకుల జేబుల్లోకి మాత్రం మాంసంకు బదులు ఏడువందల కోట్ల మనీ మాత్రం చేతులు మారింది. పశు గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈవో రాంచందర్ నాయక్, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ను విచారించిన అనంతరం 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఏసీబీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు.

అర్హులైన యాదవులకు కేటాయించిన గొర్రెలను పంపిణి చేయాలనేది పథకం ముఖ్య ఉద్దేశ్యం. పథకానికి సంబందించిన నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వచ్చాయి. దింతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంత పెద్ద కుంభకోణంలో మొయినొద్దీన్ అనే వ్యక్తి కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ఇతనితో పాటు మరికొందరిని విచారించగా దర్యాప్తులో 700 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు తేలింది.

2015 లో అప్పటి ప్రభుతం గొర్రెల పంపిణి పథకాన్ని ప్రారంభిందించి. సుమారుగా నాలుగువేల కోట్ల రూపాయల విలువైన గొర్రెలను లభిదారులకు పంపిణి చేశారు. ఈ కుంభకోణంలో కొందరు పెద్ద తలకాయల పాత్ర ఉన్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది. వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సీఈవో రాంచందర్ నాయక్ ను అరెస్ట్ చేయడానికి శుక్రవారం అయన కార్యాలయానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. అరెస్ట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. రానంటూ కొద్దిసేపు సతాయించారు. ఏసీబీ అధికారులు అరెస్ట్ వారెంట్ చూపించారు. అయినా ఆయన తన కుర్చీ లోంచి కదల్లేదు. ఎట్టకేలకు అధికారులు బలవంతంగా తీసుకెళుతుండగా ఆయన కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు తమదయిన శైలిలో హెచ్చరించారు. అప్పుడు వాళ్లంతా తప్పుకోవడంతో రాంచందర్ నాయక్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

TAGS