OTT flop movie : గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కల్ట్ మూవీ అంధాదున్ కు సీక్వెల్ గా ఒక మూవీ రాబోతోంది. అంధాదున్ భారీ విజయం తర్వాత దాన్నే సీక్వెల్ గా మలచాలని, ఈ ట్రెండ్ కు ఆ కథ బాగా సరిపోతుందని గ్రహించిన డైరెక్టర్ త్యాగరాజన్ ‘అంధగన్’ను తెరకెక్కించాడు.
త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ‘అంధగన్ : ది పియానిస్ట్’ ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ప్రశాంత్, సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, కేఎస్ రవికుమార్, వనితా విజయ కుమార్, దివంగత మనోబాల తదితరులు నటించారు.
రవియాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్ సెంథిల్ రాఘవన్, ఎడిటింగ్ సతీష్ సూర్య. ఆరేళ్ల క్రితం వచ్చిన అంధాధున్ అనే కల్ట్ క్లాసిక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబు నటించారు. మాస్ట్రో, బ్రహ్మం అనే తెలుగు, మలయాళ రీమేక్ కూడా వచ్చింది. ఈ రెండూ నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలై పెద్దగా ఆడలేదు.
ఆశ్చర్యకరంగా తమిళ చిత్ర పరిశ్రమ ఆరేళ్ల క్రితం వచ్చిన సినిమాలు, ఇతర భాషల్లో ఓటీటీలో ఫ్లాప్ చిత్రాలను ఇప్పటికీ రీమేక్ చేస్తోంది. విలక్షణమైన కథలకు, గ్రిప్పింగ్ కథనాలకు పేరుగాంచిన తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీ యుగంలో పాపులర్ సినిమాల రీమేక్ ల వైపు మొగ్గు చూపుతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే పెద్ద అద్భుతం అవుతుందని తమిళ సినీ ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.