Telangana Voter : అభ్యర్థుల సెంటిమెంట్ అస్త్రాలు.. తెలంగాణ ఓటర్ చిక్కేనా..?

Telangana Voter

Telangana Voter

Telangana Voter : తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు సెంటిమెంటును నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలిచి తీరాలని వివిధ అస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉన్నది. దాదాపు మెజారిటీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి.  ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు సెంటిమెంటును వాడుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

కొందరు తమకు ఫస్ట్ ఛాన్స్ అంటూ ఓట్లడుగుతుంటే,  మరికొందరు ఇదే చివరి ఆకాశమని రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోమని చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి లాంటి  నేతలు కూడా చివరిసారి పోటీ చేస్తున్నానని, తనకు వారసులు కూడా రాజకీయంగా లేరని, ఇదే చివరి అవకాశం గా గెలిపించాలని కోరుతున్నారు. అందోల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న బాబూమోహన్ కూడా ఇదే చెబుతున్నారు. తనకు లాస్ట్ చాన్స్ ప్లీజ్ అంటూ ఓట్లడుగుతున్నారు.

ఇక కొందరు  లోకల్ నాన్ లోకల్ సెంటిమెంటును ఉపయోగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు నాలోకల్ వారు కావడంతో, లోకల్ వారు ఈ ఆస్త్రాన్ని వినియోగిస్తున్నారు. గజ్వేల్ లో కేసీఆర్ తో పాటు ఈటెల కూడా నాన్ లోకల్ కావడంతో లోకల్ అభ్యర్థి కి ఇది అస్త్రం గా మారింది. పొంగులేటి కూడా నాన్ లోకల్ అభ్యర్థి గా బరిలో ఉన్నారు. గెలిస్తే స్థానికంగా ఉంటామని ‌స్థానిక అభ్యర్థులు ప్రధానంగా ప్రచారం చేసుకుంటున్నారు.

మరికొన్ని చోట్ల మహిళలు పురుష అభ్యర్థులపై మహిళా సెంటిమెంటును వాడుతూ పోటీ ని రసవత్తరంగా మార్చేశారు. తమకు అనుకూలంగా ఓట్లను అభ్యర్థి స్తున్నారు.

TAGS