Bigg Boss Shivaji :బిగ్ బాస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు నటుడు శివాజీ. గతంలో హీరోగా నటించి మంచి నటుడిగా పేరుపొందారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి టీవీ డిబెట్లలో పాల్గొనేవాడు. ఆ తర్వాత కొద్దికాలం సైలెంట్ అయిపోయి బిగ్ బాస్ లో చాన్స్ కొట్టేసి చివరిదాక పోరులో నిలిచారు. టాప్ త్రీలో నిలిచి శివన్నగా ఎంతో మంది ప్రేమాభిమానాలు పొందారు. ఆ తర్వాత 90ఎస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యి శివాజీ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది.
తాజాగా ఎన్నికల ఓటింగ్ ముందు ఆయన ఓ సంచలన వీడియో రిలీజ్ చేశారు. ‘‘ఏపీ సీఎం జగన్ కు ముస్లింలు అంటే ప్రేమ లేదు. బీసీలు, ఎవరిపై ప్రేమ లేదు. కేవలం ఆయనకు ఉన్న ప్రేమ మొత్తం అక్రమంగా సంపాదించుకోవడమే’ అని ఘాటుగా స్పందించారు. మిస్బా అనే విద్యార్థిని ఎలా చంపారో తెలియదు? వైసీపీ నేత కూతురు కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని మిస్బాను ఆ స్కూల్ నుంచి పంపించి మానసిక క్షోభకు గురయ్యేలా చేశారని శివాజీ పేర్కొన్నాడు.
నా ముస్లిం సోదరులు అంటూ దొంగ మాటలు చెబుతారు. నంద్యాలలో ఓ ముస్లిం కుటుంబం రైలు పట్టాల కింద ఆత్మహత్య చేసుకుంటే..అప్పుడు ఏమైపోయావు సీఎంగారు.. అలాగే పిడుగురాళ్ల వద్ద ఇద్దరు ముస్లిం సోదరులను ఊరి నుంచి తరిమివేసి..వారిని నాపరాళ్లతో కాళ్లు విరగొట్టినప్పుడు ఏమైందని అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ కు తప్పా ఎవరికైనా ఓటు వేయండి..రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు. ఆయన సంపాదించుకోవడం తప్ప..మందు మీద అక్రమంగా సంపాదించుకున్నాడు. అన్ని చోట్ల డబ్బు సంపాదించాడు.
ఇక రైతుల నుంచి భూములు, డబ్బు లాగేసుకోవడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారు. నీ సొంత భూమిని కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఆ చట్టం దుర్మార్గమైందన్నారు. వైఎస్ జగన్ ఈ ఐదేండ్లలో అక్రమంగా భారీగా సంపాదించాడు..ఆయన సంపాదించిన సొమ్ముతో ఐదారు బుల్లెట్ ట్రైన్స్ వేయవచ్చు..నేను తెలుగు దేశానికి ఓటు వేయమని చెప్పడానికి లేదా మిమ్మల్ని మభ్యపెట్టడానికి చెప్పడం లేదు..అంటూ వీడియో ముగించాడు.