Aghori : అఘోరి మొదటి భార్య చెప్పిన సంచలన నిజాలు

Aghori : లేడీ అఘోరి చుట్టూ కొనసాగుతున్న వివాదంలో తాజా మలుపు తెరపైకి వచ్చింది. అఘోరి మొదటి భార్యగా మరో యువతి బయటకు వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. జనవరి 1న అల్లూరి శ్రీనివాస్‌ తనను పెళ్లి చేసుకున్నాడని, కానీ దాదాపు 13 రోజుల్లోనే వర్షిణి అనే అమ్మాయిని రెండోసారి పెళ్లి చేసుకున్నాడని ఆవిడ వెల్లడించింది. తాను భార్యగా ఉన్నప్పటికీ, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై ప్రశ్నించింది. అఘోరి వంటి వ్యక్తులు ఎన్నిసార్లు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారోనని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అఘోరి భక్తిగా పరిచయమై, తర్వాత పెళ్లి వరకు వెళ్ళిన విషయాన్ని వెల్లడించింది. ఆశ్రమం పెట్టుకోవాలని కలలు కంటూ చివరికి అఘోరి మాటలే నమ్మలేని స్థితిలోకి వచ్చిందని వాపోయింది. ప్రభుత్వం, పోలీసులు ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.