Lok Poll Survey : లోక్ పోల్ సర్వేలో సంచలన విషయాలు.. ఏ పార్టీ గెలుస్తుందంటే?

Lok Poll survey

Lok Poll survey

Lok Poll survey : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏది గెలుస్తుందన్న చర్చ జోరుగానే జరుగుతుంది. అయితే దీనిపై లోక్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 46 శాతం ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వెల్లడైంది. కాంగ్రెస్ 69-72 స్థానాలు గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 35-39 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. బీఆర్ఎస్ కు కనీసం 40 సీట్లు రావడం కష్టమని నివేదిక పేర్కొంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్నప్పటికీ కనీసం 3 నియోజకవర్గాల్లో గెలుపు నమోదు చేయడం కష్టమైన పని కాగా, ఎంఐఎం 6 నియోజకవర్గాల్లో గెలుస్తుందని సమాచారం. కాంగ్రెస్ కు 43-46 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 38-41 శాతం ఓట్లు వస్తాయని సర్వే పేర్కొంది. బీఆర్ఎస్ కు 41 శాతం ఓట్లు వచ్చినా ఆ పార్టీ ఇన్ని సీట్లు గెలుచుకోవడం కష్టమే.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 46.78 శాతం ఓట్లు రాగా, ఈ సారి 6 శాతానికి పడిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28.43 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని, అయితే ఇప్పుడు 46 శాతానికి పెరిగిందని నివేదిక అంచనా వేసింది. గత ఎన్నికల్లో సాధించిన 7 నుంచి 8 ఓట్ల శాతాన్ని ఈ సారి బీజేపీ దక్కించుకోనుంది. ముఖ్యంగా, బీజేపీ హార్డ్ కోర్ ఓట్లను మాత్రమే దక్కించుకోగలదు, ఇతరులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల సమయంలో లోక్ పోల్ సర్వే నిజమని తేలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కు 134 సీట్లు, బీజేపీకి 65 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 72 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేస్తోంది. మరి ఈ అంచనాల్లో నిజానిజాలు తెలియాలంటే ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

TAGS