Survey in AP : ఏపీలో సంచలన సర్వే: 71 మంది ఎమ్మెల్యేలపై 70 శాతానికి పైగా వ్యతిరేకత!

Survey in AP
Survey in AP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా ఓ తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) పదిమాసాలు పూర్తయ్యకముందే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఐఐటీ నిపుణులతో కలిసి నిర్వహించిన ఓ విశ్వసనీయ సర్వే ప్రకారం, 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 71 మందిపై ప్రజల్లో 70 శాతానికి పైగా వ్యతిరేకత ఉన్నట్లు తేలింది.
ఈ అసంతృప్తికి ముఖ్యమైన కారణాలుగా మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలతో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సంబంధాలు కలిగి ఉన్నారని, ప్రజల అభిప్రాయం ప్రకారం, వారు పరిపాలన కంటే లాభదాయమైన వ్యక్తిగత వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వే పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు & పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది.
ఈ నివేదిక కూటమి ప్రభుత్వానికి పెద్దసైజు హెచ్చరికగా మారింది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మౌలిక స్థాయిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా, ఈ సర్వే కూటమి నేతలకు ప్రజల గుసగుసలు చెవికెక్కేలా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.