JAISW News Telugu

Lokesh LCU:షాక్ ఇచ్చిన లోకేష్‌..L.C.U నుంచి నో డేట్!

Lokesh LCU:ఖైదీ..విక్ర‌మ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో లొకేష్ క‌న‌గ‌రాజ్ ఇండియా వైడ్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు వ‌రుస విజ‌యాలు లోకేష ని అగ్ర ప‌థాన కూర్చోబెట్టాయి. దీంతో ఇలాంటి మేక‌ర్ తో వెంట‌నే సినిమా చేయాల‌ని ద‌ళ‌ప‌తి విజ‌య్ సీన్ లోకి వ‌చ్చేసాడు. ఆ కాంబినేష‌న్ లోనే రిలీజ్ అయిన లియో కూడా అంతే స‌క్సెస్ సాధించింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌నే సాధించింది.

కానీ అదే స్థాయిలో విమ‌ర్శ‌లు తెచ్చిపెట్టింది? అన్న విష‌యాన్ని గుర్తించాలి. ఇది లోకేష్ మార్క్ సినిమా కాద‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు..క్రిటిక్స్ పెద‌వి విరిచేసారు. ఖైదీ…విక్ర‌మ్ ల‌తో కంపారిజ‌న్ చేసి చూస్తే నిజంగానే లియో అంత గొప్ప చిత్రం కాద‌ని తేల్చారు. దీంతో ఆ నెగివిటీపై త‌ప్ప‌కుండా తాను స్పంది స్తాన‌ని లోక‌ష్ మాటిచ్చాడు. కానీ ఆ మాట అటు పై తీసిన గ‌ట్టున పెట్టాడు. నెటి జ‌నులు ఆ సంగ‌తి మ‌ర్చిపోయారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై త‌ను నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా ముందుగా రిలీజ్ తేది చెప్ప‌బోని అంటున్నాడు. షూటింగ్ ప్రారంభానికి ముందే రిలీజ్ తేది ప్ర‌క‌టిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయో లియో త‌ర్వాత లొకేష్ కి అర్ధ‌మైన‌ట్లుంది. అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. లియో ప్రారంభానికి ముందే రిలీజ్ తేది ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అనుకున్న‌ట్లుగానే సినిమా కూడా వాయిదా వేయ‌కుండా రిలీజ్ చేసారు. కానీ ఈ కార‌ణంగా లోకేష్ చాలా ఒత్తిడికి గుర‌య్యాడు. ఆగ‌మేఘాలుగా షూటింగ్ పూర్తి చేయ‌డం కోసం త‌న‌తో పాటు అంద‌ర్నీ తొంద‌ర పెట్టాల్సిన స‌న్నివేశం చూసాడు. షూట్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి ముగించే వ‌ర‌కూ ఈ ర‌క‌మైన ఒత్తిడి చూడాసాడు. అందుకే సెట్స్ కి వెళ్ల‌డానికి ముందుగానే రిలీజ్ తేదీ ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించు కున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం లొకేష్ త‌లైవార్ 171వ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Exit mobile version