Elon Musk Daughter : టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో ఎలోన్ మస్క్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఎలోన్ మస్క్ ట్రాన్స్ కూతురు వివియన్ జెన్నా విల్సన్ మాత్రం ట్రంప్ విజయం పై ఏమాత్రం సంతోషంగా ఉన్నట్లు కనిపించడంలేదు. ఇకపై తాను అమెరికాను వీడడం తప్పదేమో అని జెన్నా ప్రకటించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత, జెన్నా విల్సన్ సోషల్ మీడియా సైట్ థ్రెడ్స్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. “నేను దీన్ని కొంతకాలంగా ఆలోచిస్తున్నాను.. కానీ నిన్నటితో ఆ విషయం నిర్ధారణ అయ్యింది అని ” అని జెన్నా పోస్ట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో తనకు భవిష్యత్తు కనిపించడం లేదదని పేర్కొంది. ట్రంప్ నాలుగేళ్ల పదవిలో ఉండబోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ట్రంప్ ట్రాన్స్‌ను గుర్తించరు
డొనాల్డ్ ట్రంప్ తన గత హయాంలో లింగమార్పిడిని వ్యతిరేకించారు. ఫెడరల్ పౌర హక్కుల చట్టం ప్రకారం లింగమార్పిడి వ్యక్తులకు గుర్తింపు, రక్షణలను వెనక్కి తీసుకునే ప్రభుత్వ ప్రయత్నాలలో ఇది అత్యంత తీవ్రమైన చర్యగా పరిగణించబడింది. అయితే, బిడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రద్దయ్యింద. అయితే ఇప్పుడు మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తున్న ట్రంప్ మళ్లీ దానిపైనే కత్తి వేలాడదీశారు. అందుకే ట్రంప్‌పై ఎలోన్ మస్క్ ట్రాన్స్ డాటర్ అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాలని మాట్లాడుతున్నదని సమాచారం.
ఎలోన్ మస్క్ ట్రాన్స్ కూతురు తన తండ్రికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. లింగమార్పిడి ఆపరేషన్ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. వాళ్లిద్దరూ పరస్పరం మాట్లాడుకోవడం లేదు. జెన్నా విల్సన్ చాలా ఇంటర్వ్యూలలో తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
జెన్నా కొడుకుగా జన్మించి..
2004లో, జెన్నా విల్సన్ ఎలోన్ మస్క్- జస్టిన్ దంపతులకు జన్మించాడు. ఆ సమయంలో జేనాకు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ అని పేరు పెట్టారు. ఎలోన్ మస్క్ జస్టిన్ ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. 2008లో ఈ బంధం ముగిసింది. జెన్నా పెరిగేకొద్దీ తన తండ్రి ఎలాన్ మస్క్ అభిప్రాయాలతో సమస్యలు మొదలయ్యాయి.
2016లో, జెన్నా విల్సన్ తన అత్తకు మొదటిసారి మెసేజ్ చేసి తాను ట్రాన్స్ అని, తనకు జెన్నా అని పేరు పెట్టుకున్నానని, అయితే ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పలేదని వెల్లడించింది.
దీని తరువాత, 2022 సంవత్సరం, జెన్నా విల్సన్, జెండర్ మార్చుకున్న తర్వాత, ఇకపై తన పాత గుర్తింపుతో జీవించడం ఇష్టం లేదని బహిరంగంగా ప్రకటించింది. ఇకపై తన బయోలాజికల్ ఫాదర్‌తో ఏ విధంగానూ జీవించడం లేదని, అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పింది.
2022 సంవత్సరంలోనే, పేరు మార్పు, తన కొత్త గుర్తింపును చూపే కొత్త జనన ధృవీకరణ పత్రం కోసం శాంటా మోనికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఆ సమయంలో మీడియా నివేదికలలో ప్రచురించబడిన కోర్టు పత్రాలలో, ఎలోన్ మస్క్ 18 ఏళ్ల కుమారుడు జేవియర్ అలెగ్జాండర్ మస్క్ తన జెండర్ మార్చుకున్నానని పేర్కొన్నారు. పురుషుడి నుంచి స్త్రీగా మారిపోయాడు. ఆమె తన జెండర్ గుర్తింపును స్త్రీగా మార్చుకోవాలని , తన కొత్త పేరును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత అతని పేరు ప్రతిచోటా మార్చబడింది.