Actress Hema : తెలుగు సినిమాల్లో నటి హేమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హేమ అసలు పేరు కృష్ణవేణి ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన వారు. హేమ కేవలం ఏడో తరగతి వరకే చదువుకుని ఆపేసింది. నటి హేమకు చిన్నప్పటి నుంచి నాటక రంగం అంటే ఎంతో ఆసక్తి కనబర్చేది. దాదాపు 30 ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ అనేక రకాల పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
1989 లో వచ్చిన చిన్నారి స్నేహం సినిమాలో ఆమె తెరపై మొదటి సారి కనిపించారు. స్వాతి చినుకులు, ముద్దుల మామయ్యా, పల్నాటి రుద్రయ్య, కొడుకు దిద్దిన కాపురం లాంటి మూవీస్ లో నటించి మెప్పించింది. కానీ రామ్ గోపాల్ వర్మ నటించిన క్షణక్షణం చిత్రంతో ఆమె గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో సీనియర్ నటి శ్రీదేవికి స్నేహితురాలిగా నటించడంతో ఆమె తెలుగు లో ఆడియన్స్ కు తెలిసిపోయింది.
హేమ సీరియస్ పాత్రలతో పాటు, కామెడీ రోల్స్ కూడా చేసి నవ్వులు పంచుతూనే ఉంది. హేమ ముస్లిం అయిన సయ్యద్ జాన్ పాషాను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు. సయ్యద్ జాన్ అహ్మద్ తండ్రి ఎస్ డి లాల్ అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి లాంటి సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. హేమ భర్త సయ్యద్ జాన్ అహ్మద్ కెమెరామెన్ గా కూడా సినీ ఇండస్ట్రీలోనే పని చేశారు.
సయ్యద్ జానీ పాషానే హేమకు ముందుగా లవ్ ప్రపోజ్ చేశాడు. అనంతరం వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే బెంగళూరులో రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు మీడియా ఎదుట పేరుతో సహా వెల్లడించారు. అయితే ఆమె రేవ్ పార్టీ మరుసటి రోజు తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదని.. కేవలం తన పేరును ప్రచారం చేస్తున్నారని నమ్మకండని ప్రజలకు వీడియో విడుదల చేశారు. అయితే ఇదంతా నిజం కాదని బెంగళూరు పోలీసులు తెలిపారు. తెలుగు నటులు ఇద్దరు పట్టుబడ్డారని అందులో నటి హేమ కూడా ఉందని కుండ బద్ధలు కొట్టారు.