Amazing victory : అతిపొట్టి టోర్నీలో సంచలనం.. 11 బంతుల్లో 66 పరుగులు.. ఆస్ట్రియా అద్భుత విజయం
Amazing victory : ‘యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీ’లో సంచలనం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన లీగ్ లో రొమినియాపై ఆస్ట్రియా అద్భుతమైన విజయం నమోదు చేసింది. రొమినియా పెట్టిన 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 9.5 ఓవర్లలో ఛేదించింది.
ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రియా 8 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రియా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 61 పరుగులు కావాల్సి ఉంది. దీంతో ఆస్ట్రియా ఓటమి లాంఛనమే అని అంతా భావించారు.
కానీ, ఆస్ట్రియా బ్యాటర్లు ఇమ్రాన్ ఆసిఫ్, అకిబ్ ఇక్బాల్ వారి బ్యాట్లతో అద్భుతం సృష్టించారు. 11 బంతుల్లో 66 పరుగులు చేసి ఆస్ట్రియాకు విజయాన్ని కట్టబెట్టారు. ఇమ్రాన్, అకిబ్ 9వ ఓవర్‌లో 41 పరుగులు చేశారు. 10వ ఓవర్ తొలి 5 బంతుల్లో 20 పరుగులు చేశారు.
దీంతో లక్ష్య చేధనలో ఆస్ట్రియా 9. 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇక్భాల్ (19 బంతుల్లో 72 రన్స్ చేశాడు. అందులో 2 ఫోర్లు,10 సిక్స్‌లు) టాప్ స్కోరర్ నిలిచాడు. ఆసిఫ్ 12 బంతుల్లో 22 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఆస్ట్రియా బ్యాటర్ల ధాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేవలం 60 బంతుల్లో 168 పరుగుల లక్ష ఛేదనతో బరిలో దిగిన ఆస్ట్రియా రికార్డులను సృష్టించింది. 11 బంతుల్లో 66 పరుగులు చేసింది. అంటే స్కోర్ లో దాదాపు మూడో వంతు కేవలం 2 ఓవర్ల (ఒక బంతి తక్కువగానే)లో సాధించింది. వరల్డ్ వైడ్ స్టార్ బ్యాట్స్ మెన్స్ ఈ వైరల్ వీడియోను చూసి ఆశ్యర్యపోతున్నారు.