JAISW News Telugu

Senior Player : సీనియర్ అంటూ చాన్స్ ఇస్తే.. చెత్త ఆటతో జట్టుకే దూరమయ్యేలా ఉన్నాడు

Senior Player

Senior Player Rahul and Pant

Senior Player : ప్రస్తుతం భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భారత్ తడబడుతోంది. మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో వన్డే లో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ కారణంగానే ఇప్పుడు భారత జట్టు సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో మ్యాచ్‌లో గెలిచి టీమ్ ఇండియా సిరీస్‌లో పునరాగమనం చేయాలంటే జట్టులో కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో విఫలం అవుతుండటంతో రాహుల్ ను పక్కన బెట్టి రిషబ్ పంత్ ను తీసుకోవడం బెటర్ అని అభిమానులు సూచిస్తున్నారు.

చాలా కాలం తర్వాత కే ఎల్ రాహుల్ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. టీ 20 జట్టులో చోటు కోల్పోయిన రాహుల్ వన్డే టీంలో చోటు దక్కించుకున్నాడు. రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్ టీం ఆశించినంత మెరుగ్గా ఏమీ ఆడలేదు. ముఖ్యంగా 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కేఎల్ రాహుల్ ఇప్పటివరకు గొప్ప ఇన్సింగ్స్ ఏదీ ఆడలేదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన కేఎల్ రాహుల్ ఆ తర్వాత తడబడుతూనే ఉన్నాడు. దీంతో అతడిని టీ 20 ప్రపంచకప్ స్క్వాడ్ నుంచి తొలగించారు. అయితే టీం ఇండియా 223 రోజుల తర్వాత వన్డే సిరీస్ ఆడుతోంది. దీంతో టీంలోని చాలా మంది ప్లేయర్లకు ఇంకా టీ 20 వాసన పోవడం లేదు. అందుకే వన్డేల్లో రాణించాలంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు.

కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌కు టీమిండియా అవకాశం ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది.  జట్టులో వైవిధ్యం తీసుకురావడానికి రిషబ్ పంత్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. రిషబ్

పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ కావడంతో అతడి బ్యాటింగ్ లో కొంత వైవిధ్యం ఉంటుంది. అటు శ్రీలంక బౌలర్లను కూడా ఇబ్బంది పెట్టొచ్చు. మూడో మ్యాచ్ లోో కేఎల్ రాహుల్ ను తొలగించడంతో పాటు మరి కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని ఎక్స్ ఫర్ట్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version