Congress MLC : కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. నేతల అలకలు వారిని ఓదార్చడం లాంటివి కొనసాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119లో మ్యాజిక్ ఫిగర్ 60. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 4 సీట్లు మాత్రమే కాంగ్రెస్ వద్ద ఎక్కువగా ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీని కలుపుకుంటే 47 సీట్లు అవుతాయి. ఇక బీజేపీ ఉంటే ఎంఐఎం ఉండదు.. ఎంఐఎం ఉంటే బీజేపీ ఉండదు కాబట్టి ఒక సీటు ఎక్కువగా ఉన్న బీజేపీని కలుపుకొని ఎంఐఎం మద్దతు కోరితే బీఆర్ఎస్ కు కేవలం 11 సీట్ల తేడా మాత్రమే ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నడపాలంటే ఇతర పార్టీల నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను కాలుపుకోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నవారెవెరూ.., ఆయా నియోకజవర్గం పరిస్థితులు అక్కడి కాంగ్రెస్ నాయకులకు వారికున్న సాన్నిహిత్యం దృష్ట్యా పార్టీ అధిష్టానం పరిశీలించాలి. కానీ స్థానిక సీనియర్ నేతకు ఎలాంటి సమాచారం లేకుండా పార్టీలో చేర్చుకోవడంతో గందరగోళం నెలకొంది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో పార్టీని తన భుజస్కందాలపై నడిస్తున్నాడు. గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన కేసీఆర్ ఎంత ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారలేదు. కాంగ్రెస్ లో ఉంటానని బయటకు వచ్చేది లేదని చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం వెళ్లలేదు. ఇటీవల ఎన్నికల్లో 2023 కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఓడిపోయారు.
అయితే, ఇటీవల సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరికపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరిక విషయం తనకు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తన పదవి, పార్టీని వీడుతారన్న వార్తలు బయటకు వచ్చాయి. తనపై పోటీ చేసిన నాయకుడిని చేర్పించుకోవడం పైగా తనకు సమాచారం లేకపోవడం తీవ్ర అవమానం అని ఆయన కార్యకర్తలు వాపోయారు. అయితే ఆయనను మంత్రులు శ్రీధర్ రెడ్డి, తదితరులు బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికైతే పార్టీ మారే ఆలోచన లేదని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత జగిత్యాలలోని పల్లెలన్నీ తిరుగుతానని, ప్రస్తుతానికైతే బీజేపీని నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని, కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ‘ఇన్నాళ్లు పార్టీ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని గౌరవించా, శిరసావహించా.. కానీ ఈ రోజు నాకు గౌరవం దక్కలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.