V.H:సీఎం ఎవరో తేల్చేసిన వీహెచ్..రేవంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
V.H:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థుల్ని చిత్తు చేస్తూ విజయఢంకా మోగిస్తున్నారు. అంతే కాకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు షాక్ ఇచస్తూ ఖాతా తెరిచి ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, ఇల్లందుల్లో విజయం సాధించింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం ఖాయం అని తేలడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అధికారంలోకి రాదనుకున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి అన్నీ తానై నడిపించిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేసిన కామారెడ్డి, కొడంగల్‌లలో ముందంజలో ఉండటంతో ఆయని ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌తో పాటు మహేఫ్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డి ఇంటికి చేరి ఆయనని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
దీంతో కాబోయే సీఎం రేవంత్ రెడ్డేనని స్పష్టంగా తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాము ముందునుంచి చెబుతున్నట్టే కాంగ్రెస్ విజయం సాధిస్తోందన్నారు. ఇది ప్రజల విజయమని, బీఆర్ ఎస్, బీజేపీల వైఫల్యాన్ని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని తెలిపారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారని, అది కూడా బాగా కలిసి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని, ఆయన పార్టీ కోసం కష్టపడ్డారని, కామారెడ్డిలో ఖచ్చింతంగా గెలుస్తారని స్పష్టం చేయడం విశేషం.