Actress Annapurna : షూటింగ్ లో 8గంటలు ఆ పని చేసి.. రాత్రిళ్లు భర్తతో శృంగారం చేయలేకపోయేదాన్ని.. సీనియర్ నటి హాట్ కామెంట్స్
Actress Annapurna : తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులు తమ అనుభవాలను యూట్యూబ్ ద్వారా ఆడియన్స్ తో పంచుకుంటున్నారు. వారు కెరీర్ లో పడిన కష్టాలు, వ్యక్తుల ప్రవర్తన, తమ ఆస్తులు, సంపాదన, వ్యక్తిగత జీవితం..ఇలా అన్ని విషయాలను ఓపెన్ గా పంచుకుంటున్నారు. అయితే ఇవి కొన్ని సార్లు ఆసక్తికరంగా ఉన్నా.. మరికొన్ని సార్లు వివాదమై కూర్చుంటాయి. తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు అత్యంత వివాదస్పదంగా మారాయి. కొన్ని విషయాలు ఫన్ క్రియేట్ చేశాయి..
ఇటీవల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఆడదానికి ఏం పని? నడిరాత్రి వారికి రోడ్లపై తిరగాల్సిన అవసరం లేదు. అలాగే వారు ధరించే దుస్తుల వల్లే దేశంలో రేప్ సంఘటనలు పెరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్నపూర్ణమ్మకు కౌంటర్ గా సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెద్దవి చేశాయి. అన్నపూర్ణమ్మపై చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ లో కూడా కేసు నమోదైంది. ఈ వివాదాన్ని పక్కన పెడితే అన్నపూర్ణమ్మ మరోసారి ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
తన భర్త బ్రాహ్మణ కులానికి చెందిన వారని, చాలా మంచివారని ఆమె తెలిపారు. తన కెరీర్ సవ్యంగా సాగడానికి ఆయన ఎంతగానో సహకరించారని చెప్పారు. ఆయన లేకపోతే 600 పైగా సినిమాలు చేసేదాన్ని కాదని చెప్పుకొచ్చారు. కానీ తమ మధ్య శృంగార జీవితం అంతంత మాత్రంగానే సాగేది అని బెడ్రూం విషయాలను పంచుకున్నారు.
షూటింగ్ లో రోజంతా పనిచేయడం వల్ల ఇంటికి వచ్చేసరికి అలసిపోయేదాన్నని, ఇంటికి రాగానే నిద్రపట్టేదని చెప్పారు. దాదాపు 8 గంటల పాటు షూటింగ్ లో ఉండేవాళ్లమని, సీనియర్ నటుల చూపంతా తమపైనే ఉండేదాని తెలిపింది. దీంతో భయంగా భయంగా బతికేవారమన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి.. ఇంటికి వచ్చిన భర్తతో శృంగారానికి ఓపిక ఉండేది కాదని పాత ఘటనలను గుర్తుచేసుకున్నారు.