Supreme Court : జైలుకు పంపుతాం జాగ్రత్త.. HCUలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Supreme Court : సుప్రీంకోర్టు, HCU భూముల్లో చెట్లను అనుమతులు లేకుండానే నరకడం, మరియు దాని వల్ల జంతుజీవులపై జరిగిన దుష్పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. “100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి. లేకపోతే చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులను జైలుకు పంపిస్తాం,” అంటూ కోర్టు ఘాటుగా హెచ్చరించింది.

చెట్లను కొట్టివేయడంలో తీసుకున్న అనుమతులపై స్పష్టత కోరిన కోర్టు, దీనివల్ల జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయిన వీడియోలపై ఆందోళన వ్యక్తం చేసింది. తీర్పు తరువాత కూడా బుల్డోజర్లు అక్కడే ఉండడంపై జస్టిస్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై కోర్టు హెచ్చరికలు జారీ చేస్తూ, పునరుద్ధరణను వ్యతిరేకిస్తే ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు కట్టి వారిని పంపుతామంటూ స్పష్టం చేసింది. “మేము చెప్పే వరకు ఒక్క చెట్టునైనా నరకవద్దు,” అంటూ తుది హెచ్చరిక ఇచ్చింది.

TAGS