CM Chandrababu
CM Chandrababu : స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు swarandhra.ap.gov.in/suggestions ద్వారా పంపాలన్నారు. పంపినవారు తర్వాత అభినందనలను ఇ-సర్టిఫికెట్ ద్వారా అందుకోవచ్చని చెప్పారు. 2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్@2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఏపీ భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సూచనను పరిణనలోకి తీసుకుంటూ సమష్టిగా స్వర్ణాంధ్రను నిర్మించుకుందామన్నారు.