MS Dhoni : కోహ్లీ తో పాటు నన్ను ఇంటికి పంపించేయండి: ధోని

MS Dhoni

MS Dhoni

MS Dhoni : ఇండియా క్రికెట్ లో ఎమ్మెస్ ధోని పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది. అయితే ఫామ్ లో లేని క్రికెటర్లను ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించడంలో ధోనీ తర్వాతనే ఎవరైనా అని చెప్పొచ్చు. పాకిస్తాన్ తో సిరీస్ కు ముందు విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ మీ టీం నుంచి తీసేయాలని మేనేజర్ ధోనీకి సూచించాడంట ఈ విషయాన్ని చెప్పింది. ఇండియా క్రికెటర్ కాదు అప్పటి పాకిస్తాన్ టీం లోని ఉమర్ అక్మల్ అనే బ్యాటర్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.

 ఇండియా 2012 13 లో ద్వైపాక్షిక సిరీస్ లో పాల్గొంది ఈ సిరీస్ కు సంబంధించి మ్యాచ్లు జరిగే సమయంలో టీం ఇండియా నుంచి విరాట్ కోహ్లీని పక్కకు తప్పించాలని మేనేజర్ ధోని కి సూచించాడు. అంట అయితే ధోని తాను కూడా ఆరు నెలల నుంచి ఇంటికి వెళ్లలేదని తనకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే వెళ్ళిపోతానని చెప్పాడంట దీంతో మేనేజర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.

 ఆ తర్వాత సిరీస్ లో విరాట్ కోహ్లీ అదిరిపోయే పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు ఈ విషయంపై  అక్మల్ మాట్లాడుతూ ఇలాంటి కెప్టెన్సీ ఇటువంటి జట్టు ఉన్నప్పుడు ఏ ప్లేయర్ అయినా తన పూర్తి పర్ఫామెన్స్ బయటకు తీసుకురావడానికి అవసరం అవుతుంది.

 కాబట్టి టీమిండియా ఈ విధంగా రాణించడానికి ధోని కూడా ఒక కారణమని చెప్పటంలో సందేహం లేదు. ప్లేయర్స్ నే కాపాడుకోవడంలో టాలెంట్ ఉన్న ప్లేయర్ని ఎంకరేజ్ చేయడంలో ధోని తర్వాతనే ఎవరైనా అని ఈ విషయాన్ని బట్టి అర్థం అవుతుంది.

 సురేష్ రైనా, ఉమర్ అక్మల్ , ధోని, యువరాజ్ మరి కొంతమంది క్రికెటర్లు కలిసి డిన్నర్ చేసిన సమయంలో ఇదే విషయం ధోనిని ఉమర్  అడిగితే ప్లేయర్లకు ఛాన్స్ ఇస్తేనే కదా వారి పెర్ఫార్మన్స్ ఏంటో బయటపడేది. విరాట్ కోహ్లీ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అలాంటి వ్యక్తిని పక్కకు పెట్టడం అనేది మూర్ఖత్వం అవుతుంది అని చెప్పాడంట అందుకే ధోని ఇస్ ద బెస్ట్ అని అంటుంటారు.

TAGS