India vs New Zealand : వన్డే వరల్డ్ కప్ 2023 లో లీగ్ దశలో ఓటమెరుగని జట్టుగా టీమిండియా జట్టు నిలిచింది. లీగ్ దశలో తొమ్మిది మ్యాచులు ఆడిన రోహిత్ సేన అన్నింటా గెలిచింది. లీగ్ దశలో ఆస్ర్టేలియా, ఇంగ్లాండ్, ఆప్గానిస్థాన్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించింది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రోహిత్ సేన సమష్టిగా రాణిస్తున్నది. టాప్ 5 బ్యాట్స్ మన్ , బౌలర్లు రాణిస్తుండడం టీమిండియాకు ఇక్కడ కలిసివస్తున్నది.
ఇక లీగ్ లో ఆఖరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో ప్రాక్టీస్ లా మ్యాచ్ ను వినియోగించుకున్నది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగారు. ఇక శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు కొట్టారు. ఆ తర్వాత రోహిత్, విరాట్ బౌలింగ్ కూడా చేశారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ చెలరేగి ఆడడం భారత అభిమానుల్లో సంతోషం నింపింది. ఆల్ రౌండ్ ప్రతిభతో టీమిండియాను వరల్డ్ కప్ సాధించే దిశగా రోహిత్ ప్రయత్నిస్తున్నాడు. అయితే అసలు పరీక్ష టీమిండియాకు ఇక ఎదురు కాబోతున్నది. ఇక ఇప్పటివరకు టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ కూడా ఉత్కంఠగా జరగలేదు. సెమీఫైనల్ మ్యాచ్ పై మాత్రం అందరి దృష్టి నెలకొని ఉంది.
టీమిండియా సెమీస్ ను బుధవారం ఆడబోతున్నది న్యూజిలాండ్ తో సెమీస్ లో టీమిండియా తలపడబోతున్నది. గత రికార్డుల నేపథ్యంలో భారత అభిమానుల్లో ఈ మ్యాచ్ పై ఆందోళన నెలకొంది. న్యూజిలాండ్ ను టీమిండియా సెమీ ఫైనల్ లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢీకొట్టబోతున్నది. ఈ సందర్భంగా రోహిత్ సేనపై విపరీత ఒత్తిడి ఉండబోతున్నది. ఏదేమైనా ఇది కీలక పరీక్ష కాబోతున్నది. రోహిత్ సేన కలిసికట్టుగా రాణిస్తే ఇక ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.