Cars : ఐదు నిమిషాలకో కారు అమ్మకం..ఇంతకీ ఏంటది?
Cars : కారంటే మోజు లేనిది ఎవరికి. కారుపై రయ్ రయ్ మని వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు. ఒకప్పుడు కారు అనేది విలాసవస్తువు. కానీ ఇప్పుడది అత్యవసర వస్తువు అయిపోయింది. ఇంటికో బైక్ ఉన్నట్టుగానే ఇంటికో కారు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రిచ్ పీపులే కాకుండా మిడిల్ క్లాస్ జనాలు కారు కొనేందుకు తెగ మోజు పడుతున్నారు. అందుకే కార్ల వ్యాపారానికి భారత్ వేదికగా మారింది. అందుకే ప్రపంచంలోని కార్ల కంపెనీలు భారత్ ను బంగారు బాతుగా చూస్తున్నాయి. మీడియం రేంజ్ కార్లకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉండడంతో సేల్స్ లో రికార్డులు బద్దలవుతున్నాయి.
భారత్ లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దేశీయంగా హ్యుందాయ్ క్రెటా వన్ మిలియన్ అమ్మకాల మార్క్ ను సాధించినట్టు తెలిపింది. 2015లో మార్కెట్ కు పరిచయమైన క్రెటా కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఘనత సాధించింది. ఈ సమయంలో క్రెటా భారత్ లో అత్యధికంగా అమ్ముడైన మిడ్ సైజ్ ఎస్ యూవీగా కొనసాగుతోంది. ప్రతీ 5 నిమిషాలకు ఒక క్రెటా అమ్ముడుపోవడం విశేషమనే చెప్పాలి.
క్రెటా కారు కొన్ని ఫీచర్స్..
ఏఆర్ఏఐ మైలేజీ : 18.4 Kmpl
ఇంధన రకం : పెట్రోల్
నంబర్ ఆఫ్ సిలిండర్స్ : 4
సీటింగ్ సామర్థ్యం : 5
ట్రాన్స్ మిషన్ టైప్ : ఆటోమేటిక్
ఇంధన ట్యాంకు సామర్థ్యం: 50 లీటర్స్
ఈ కారులో పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఎయిర్ కండీషనర్, డ్రైవర్, ప్యాసెంజర్స్ ఎయిర్ బ్యాగులు, అల్లాయ్ వీల్స్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉన్నాయి. ధర రూ.11 లక్షల నుంచి 20 లక్షల వరకు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.